Anil Ambani : అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ ఆకస్మిక సోదాలు.. రూ.3000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు వేగవంతం.

Anil Ambani : అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

Anil Ambani | న్యూఢిల్లీ: బ్యాంకు రుణాల ఏగవేత..మోసం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ(Anil Ambani) కంపెనీలలో సీబీఐ(CBI) శనివారం మరోసారి ఆకస్మిక సోదాలు చేపట్టింది. అరకామ్ కంపెనీల్లో సీబీఐ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. గత నెలలో ఈ కేసులో ఢిల్లీ(Delhi), ముంబాయ్(Mumbai) సహా 40ప్రాంతాల్లో 50కి పైగా కంపెనీలపై ఈడీ కూడా సోదాలు నిర్వహించడం గమనార్హం. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది.

2017 -19 మధ్యకాలంలో బ్యాంకుల నుంచి రుణాలుగా పొందిన రూ. 3000 కోట్లను మనీలాండరింగ్(Money Laundering) పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రమోటర్లు, ప్రజలను పక్కదారి పట్టించేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించి బ్యాంకు ఉద్యోగులను మేనేజ్ చేసి రుణాల ఎగవేతకు పాల్పడినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.