Ugadi Rasi Phalau 2025 | ఉగాది త‌ర్వాత ఉద్యోగుల జాత‌కాలు ఇలా.. ఈ రాశివారికి తిరుగు లేదు ఇక‌..!

Ugadi Rasi Phalau 2025 | ప్ర‌తి ఏడాది ఉగాది ప్రారంభంతో.. కొత్త తెలుగు సంవత్స‌రంలోకి అడుగుపెడుతాం. ఈ ఏడాది శ్రీ విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌రం(Sri Viswavasu Nama Samvatsaram)లోకి అడుగుపెట్ట‌బోతున్నాం. ఈ నామ సంవ‌త్స‌రంలో ఉద్యోగుల జాత‌క ఫ‌లాలు( Employees Horoscope ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj    latest    Mar 24, 2025 7:33 AM IST
Ugadi Rasi Phalau 2025 | ఉగాది త‌ర్వాత ఉద్యోగుల జాత‌కాలు ఇలా.. ఈ రాశివారికి తిరుగు లేదు ఇక‌..!

Ugadi Rasi Phalau 2025 | స్వ‌స్తి శ్రీ క్రోధి నామ సంవ‌త్సరానికి త్వ‌ర‌లోనే ముగింపు ప‌ల‌క‌బోతున్నాం.. ఇక స్వ‌స్తి శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రం(Sri Viswavasu Nama Samvatsaram) లోకి అడుగు పెడుతాం. మార్చి 30వ తేదీన ఉగాది( Ugadi )తో శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఉగాది ప్రారంభంతో.. అంద‌రి జాత‌క ఫ‌లాలు మారుతాయి. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. కొంద‌రు లాభ‌ప‌డొచ్చు.. ఇంకొంద‌రు న‌ష్ట‌పోవ‌చ్చు. మ‌రికొంద‌రు రెండు ర‌కాల బెనిఫిట్స్ పొందొచ్చు. వీట‌న్నింటిని తెలుసుకునేందుకు ఉగాది త‌ర్వాత వారి వారి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌డం ముఖ్యం. మ‌రి ముఖ్యంగా ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉద్యోగుల జాత‌క ఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉద్యోగులకు వారి రాశుల ప్ర‌కారం.. ఎలాంటి లాభాలు, న‌ష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఒక రాశి వారికి మాత్రం తిరుగు ఉండ‌దు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేష రాశి ( Aries )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి ఉద్యోగులకు శుభ సమయం న‌డ‌వ‌నుంది. గురు గ్రహం అనుకూతల వల్ల ఉన్నతాధికారుల మీపై ద‌య చూపిస్తారు. ప్రభుత్వ సంస్థ‌ల్లో ప‌ని చేసే ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ప్ర‌యివేట్ ఉద్యోగులు కూడా మంచి ఇంక్రిమెంట్ సాధిస్తారు. లేదంటే మరో ఉద్యోగం సాధించడంలో విజ‌యం సాధిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ కూడా నెరవుతుంది. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశ తప్పదు.

వృషభ రాశి ( Taurus )

ఉగాది త‌ర్వాత వృష‌భ రాశి వారికి తిరుగు లేద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎలాంటి క‌ష్టాలు ఎదురైనా.. ఉద్యోగం విష‌యంలో అంతిమంగా మంచి జ‌రుగుతుంద‌ట‌. స్థిర‌త్వం కూడా వ‌స్తుంద‌ట‌. ఇక ఇంక్రిమెంట్లు, ఉన్న‌తాధికారులు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయ‌ట‌. ప‌ని చేసే ప్ర‌దేశంలో మీ తెలివితేట‌ల‌కు గుర్తింపు త‌ప్ప‌నిస‌రిగా ల‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

మిథున రాశి ( Gemini )

ఈ రాశి ఉద్యోగులకు యోగకాలం. ఉన్న చోట ప్రమోషన్ లేదంటో మరో కంపెనీలో ఉన్నత స్థానం పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి ఇంక్రిమెంట్ ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సాధిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు శుభవార్త వింటారు.

కర్కాటక రాశి ( Cancer )

క‌ర్కాట‌క రాశి ఉద్యోగుల‌కు.. ఉగాది ప్రారంభం నుంచి.. మ‌ళ్లీ వ‌చ్చే ఉగాది వ‌ర‌కు మ‌హోన్న‌తంగా ఉంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్స్, బ‌దిలీలు ఉంటాయ‌ట‌. ప్ర‌యివేటు ఉద్యోగుల‌కు కూడా మంచి గుర్తింపు ల‌భించ‌నుంది. ఇక క‌ష్ట‌ప‌డే ఉద్యోగుల‌కు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయి. ఈ ఏడాది జులై వరకూ చికాకులు ఉన్నప్పటికీ ఆ తర్వాత మొత్తం ఈ రాశి ఉద్యోగులకు శుభసమయమే.

సింహ రాశి ( Leo )

శ్రీ విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌రంలో సింహ రాశి ఉద్యోగుల‌కు అస్స‌లు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని పండితులు చెబుతున్నారు. ఎంత క‌ష్ట‌ప‌డ్డా, ఎన్ని తెలివితేట‌లు ప్రదర్శించినా ఈ ఏడాది సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టమేన‌ట‌. ప‌ని చేసే ప్ర‌దేశంలో ఊహించని అవమానాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పవు. ప్రైవేట్ ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. నిరుద్యోగులు ఆశించినస్థాయిలో సెటిలవలేరు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశ తప్పదు.

కన్యా రాశి ( Virgo )

క‌న్యారాశి వారికి ఉగాది త‌ర్వాత కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలనుంచి ఈ రాశి ఉద్యోగులకు ఉపశమనం ల‌భించి, ఇకపై అన్నీ మంచి రోజులే అన్నట్టుంటుంది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉద్యోగుల‌కు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.

తులా రాశి ( Libra )

శ్రీ విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌రం.. తులా రాశి ఉద్యోగులకు ఆహా అనేలా ఉంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోతారు. శని యోగకారకుడు కావడంతో ఈ రాశి ఉద్యోగులకు అంతా మంచే జరుగుతుంది. ఈ ఏడాది మీకు ప్రమోషన్‌తో కూడిన బదిలీలు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయ మూలాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. మొత్తానికి తులా రాశి వారికి శ్రీ విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌రం క‌లిసి వ‌స్తుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

వృశ్చిక రాశి ( Scorpio )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ ప్రభావం అంతగా ఉండదు. అర్ధాష్టమ శని తొలగిపవడంతో మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి ఉద్యోగులకు జీతం, హోదా పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు.

ధనుస్సు రాశి ( Sagittarius )

ఈ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మహోన్నతంగా ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం శుభస్థానంలో ఉండండతో. ఉద్యోగంలో పదోన్నతులు లభించ‌డంతో పాటు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల‌కు ఆశించిన స్థాయిలో ఇంక్రిమెంట్స్ ఉంటాయి. నిరుద్యోగులు ఈ ఏడాది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది

మకర రాశి ( Capricorn )

శ్రీ విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌రంతో మీకు ఏల్నాటి శని వదిలిపోతుంది. గురు గ్రహం, రాహువు కూడా శుభ స్థానంలో ఉన్నారు. ఫలితంగా ఈ రాశి ఉద్యోగులకు యోగకాలం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులు మంచి ఇంక్రిమెంట్స్ పొందుతారు. ఉన్నతస్థాయి కంపెనీలో అవకాశాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల నెరవేరుతుంది. మార్చి నుంచి జూలై మధ్య ఓ శుభవార్త వింటారు.

కుంభ రాశి ( Aquarius )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీకు ఏల్నాటి శని ఉంది. ఫలితంగా కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులు అదృష్టాన్ని అస్సలు నమ్ముకోవద్దు. జన్మ రాహువు కారణంగా ఇబ్బందులుంటాయి కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు. మీ తెలివితేటల్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగం సాధిస్తారు.

మీన రాశి ( Pisces )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగులకు అంతా బావున్నట్టే అనిపిస్తుంది కానీ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. వస్తాయి అనుకున్న ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉంది. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నిరుద్యోగులు ఈ ఏడాది ఉద్యోగం సాధించడం కష్టమే.