ప్ర‌తి 11 నిమిషాల‌కో మ‌హిళ లేదా బాలిక హ‌త్య‌..!

UNO | ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై ఐక్యరాజ్య స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో ప్ర‌తి 11 నిమిషాల‌కో మ‌హిళ లేదా అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుట్రెస్ పేర్కొన్నారు. అయితే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది కూడా కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులేన‌ని గుట్రెస్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన మహిళ‌ల‌పై హింస నిర్మూల‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఐరాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుట్రెస్ ఈ […]

ప్ర‌తి 11 నిమిషాల‌కో మ‌హిళ లేదా బాలిక హ‌త్య‌..!

UNO | ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై ఐక్యరాజ్య స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో ప్ర‌తి 11 నిమిషాల‌కో మ‌హిళ లేదా అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుట్రెస్ పేర్కొన్నారు. అయితే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది కూడా కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులేన‌ని గుట్రెస్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన మహిళ‌ల‌పై హింస నిర్మూల‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఐరాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుట్రెస్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌లు, బాలిక‌ల హ‌త్య‌ల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌పంచ దేశాలు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని గుట్రెస్ పిలుపునిచ్చారు.

మ‌హిళ‌లు, అమ్మాయిల‌పై వేధింపులు, హింస అనేది హ‌క్కుల ఉల్లంఘ‌న అని పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యులు లేదా భాగ‌స్వాములే మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను శారీర‌కంగా, మాన‌సికంగా హింసిస్తున్నార‌ని, ఇందుకు క‌రోనా నేప‌థ్యంలో త‌లెత్తిన ఆర్థిక సంక్షోభం కూడా కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనూ మ‌హిళ‌ల‌పై వేధింపులు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌పంచంలో సగం మంది మ‌హిళ‌లు వేధింపుల‌ను, హింస‌ను ఎదుర్కొంటున్నార‌ని, దీనివ‌ల్ల త‌మ హ‌క్కులు, స్వేచ్ఛ‌, ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోతున్నార‌ని గుట్రెస్ విచారం వ్య‌క్తం చేశారు.

అంతేకాదు మ‌హిళ‌ల‌పై దాడులు, హింస అనేవి ఇక చ‌రిత్ర పుస్త‌కాల్లో చేరాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఐరాస సెక్రెట‌రీ అన్నారు. ప్రభుత్వాలు మహిళా హక్కుల కోసం పోరాడే సంస్థలకు ఇచ్చే నిధులను 50 శాతం పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు మహిళా హక్కులకు మద్దతుగా గళం విప్పాలని, ‘మేము కూడా ఫెమినిస్టులం’ అని గర్వంగా ప్రకటించాలని పిలుపునిచ్చారు.