ఆసుపత్రిలో బెడ్‌పై పడుకొని సెలైన్ ఎక్కించుకుంటున్న సమంత.. ఫ్యాన్స్‌లో టెన్షన్

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత గత కొద్ది రోజులుగా అనేక ఇబ్బందులు ఏదుర్కొంటుంది. నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి ఉందని తేలడం, ఆ సమయంలో చేసిన సినిమాలు అంతగా ఆదరణ పొందకపోవడం సమంతని చాలా నిరుత్సాహపరిచాయి.
అయితే సమంత కొద్ది రోజులుగా తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది.సినిమాలు మానేసి, పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంటుంది. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, మధ్య మధ్యలో వెకేషన్లంటూ తిరిగేస్తూ, విదేశాలలో మయోసైటిస్‌కి చికిత్స కూడా తీసుకుంటుంది.
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది. ఇందులో సమంత హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నట్టుగా, చేతికి సెలైన్ పెట్టించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే సమంత ఇలా బెడ్‌పై పడుకొని సెలైన్ పెట్టించుకోడంతో అందరు కంగారు పడ్డారు.
అయితే ఇక్కడ కంగారు పడాల్సింది ఏమి లేదు. సమంత రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఆ సెలైన్ తీసుకుంటున్నట్లు తన పోస్ట్ ద్వారా తెలియజేసింది. సమంత తీసుకుంటున్న సెలైన్ ఇమ్యూనిటీ బూస్టర్ కాగా, ఇది రక్తకణాల ఉత్పత్తి. రోగ నిరోధక శక్తి, కండరాల శక్తి, వైరస్ లని ఎదుర్కొనే శక్తి, ఎముకలకు శక్తి లాంటి ప్రయోజనాలని అందిస్తుందని సమంత పేర్కొంది.
సమంత త్వరగా మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకోవాలని, ఫుల్ ఎనర్జీతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇటీవల సమంత ఓ లైవ్ సెషన్‌లో పాల్గొనగా, ఆ సమయంలో సమంత ఫేస్‌లో చాలా మార్పులు కనిపించాయి.
అయితే ఓ అభిమాని దీని గురించి ప్రశ్నించగా, ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది. అది నా స్కిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది అని సమంత పేర్కొంది. చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సమంత ఏడాది తర్వాత తిరిగి సినిమాలతో సందడి చేయనున్నట్టు సమాచారం.