లోకేష్ యాత్రకు రైతుల శాపం.. అందుకే యువగళం ఫెయిలైందా!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు అయినా దిక్కులేదని సమర్థిస్తున్న వైనం.. విధాత: లోకేష్ చేపట్టిన భారీ పాదయాత్రకు అమరావతి రైతుల శాపం తగిలిందని అందుకే యువగళం యాత్రకు అనుకున్నంత స్పందన రావడం లేదని రాజధాని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈమేరకు రాజధాని రైతుల గ్రూపుల్లో మెసేజీలు.. అభిప్రాయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. వాస్తవానికి లోకేష్ పాదయాత్ర తాలూకూ సందడి పార్టీలోనూ కరువైంది. లోకేష్ స్టాఫ్.. భద్రతా సిబ్బంది మినహా పెద్దగా జనాలు ఆయన వెంట నడవడం లేదన్నది […]

- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు
- అయినా దిక్కులేదని సమర్థిస్తున్న వైనం..
విధాత: లోకేష్ చేపట్టిన భారీ పాదయాత్రకు అమరావతి రైతుల శాపం తగిలిందని అందుకే యువగళం యాత్రకు అనుకున్నంత స్పందన రావడం లేదని రాజధాని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈమేరకు రాజధాని రైతుల గ్రూపుల్లో మెసేజీలు.. అభిప్రాయాలు సర్క్యులేట్ అవుతున్నాయి.
వాస్తవానికి లోకేష్ పాదయాత్ర తాలూకూ సందడి పార్టీలోనూ కరువైంది. లోకేష్ స్టాఫ్.. భద్రతా సిబ్బంది మినహా పెద్దగా జనాలు ఆయన వెంట నడవడం లేదన్నది తేలిపోయింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు లోకేశ్ పాదయాత్ర ఎందుకు ప్లాప్ అయ్యిందో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
అందులో ఏమని రాశారంటే
“లోకేశ్ పాదయాత్రకు అమరావతి రైతుల ఉసురు తగిలిందని, అందుకే పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందని రెండు రోజులుగా మన అమరావతి గ్రూపుల్లో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు పెట్టిన వారి మనసులోని బాధను మనందరం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే లోకేశ్ పాదయాత్రని ప్రమోట్ చేసుకోవటానికి మన అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్రను చంద్రబాబు గారు ఆపించారు” అని రాశారు.
ఇంకా
“ప్రస్తుతం మనం చేయగలిగిందేమీ లేదు. చంద్రబాబు ఎలాంటి వాడైనా మనకిప్పుడు తెలుగుదేశమే దిక్కు. కాబట్టి లోకేశ్ పాదయాత్రకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. మన శిబిరాల్లో కూడా దయచేసి చంద్రబాబుని తిట్టడాన్ని ఏ ఒక్కరూ ప్రోత్సహించవద్దు. మనం మరో సంవత్సరం పోరాడాలి. దయచేసి ఓపిక పట్టండి. న్యాయస్థానంలో మనం గెలుస్తాం. జై అమరావతి”
మొత్తానికి రైతులు చంద్రబాబు మీద కోపంతో ఉన్నప్పటికీ గత్యంతరం లేని స్థితిలో మళ్ళీ టిడిపికి సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ముందే రైతులు పాదయాత్ర చేసేస్తే ఇక లోకేష్ యాత్రను ఎవరూ పట్టించుకోరన్న భయంతో రైతుల యాత్రను చంద్రబాబే ఆపించారని రైతులు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.
మొత్తానికి అమరావతి రైతులు గోల చేయకుండా గుర్తింపు కార్డులు చూపించి పాదయాత్ర చేయొచ్చు అనగానే యాత్రను ఆపేసిన సంగతి తెలిసిందే. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని రైతులు అనుమానిస్తూనే ఇప్పుడు లోకేష్ యాత్ర ఫెయిల్ అవ్వడాన్ని లోలోన సంతోషిస్తున్నట్లు ఈ పోస్టుల బట్టి తెలుస్తోంది.