Fever | ప్రతి ఇంట్లో జ్వర పీడితులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగులు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District)లో జ్వరాలు(Fevers) దడ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతి ఇంట్లో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారు. కనీసం 4 రోజుల వరకు లక్షణాలు తగ్గట్లేదని బాధితులు చెబుతున్నారు. గడిచిన పది రోజులుగా వాతావరణ మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫీవర్, జిల్లా ఆసుపత్రుల మొదలు పీహెచ్‌సీలతోపాటు బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లకు పేషెంట్లు […]

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District)లో జ్వరాలు(Fevers) దడ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతి ఇంట్లో ఒకరు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారు. కనీసం 4 రోజుల వరకు లక్షణాలు తగ్గట్లేదని బాధితులు చెబుతున్నారు. గడిచిన పది రోజులుగా వాతావరణ మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫీవర్, జిల్లా ఆసుపత్రుల మొదలు పీహెచ్‌సీలతోపాటు బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లకు పేషెంట్లు క్యూ కడుతున్నారు.
ఫీవర్ రందీ
జ్వరం, దగ్గు, నీరసం, జలుబు, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు మొదట నాలుగురోజులకు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత తగ్గకుండా ఉంటే ఆస్పత్రికి మరోసారి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండోసారి వచ్చిన పేషెంట్లకు బ్లడ్ టెస్టులకు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో శాంపిళ్లు సేకరించి డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. సాధారణ రోజుల్లో 24గంటల నుంచి 48గంటల్లో రిపోర్టులు వచ్చేవి. కానీ ఇప్పుడు టెస్టింగ్ కేంద్రాలకు శాంపిళ్ల లోడ్ పెరగడంతో మూడు రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అప్పటి వరకు కొన్ని చోట్ల వైద్య సేవల్లో జాప్యం జరుగుతుందని పేషెంట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మలేరియా(Malaria), డెంగ్యూ (Dengue) తక్కువే
సాధారణంగా మలేరియా, డెంగ్యూ విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ సీజనల్ మార్పులతో ఈ సారి ఫ్లూ లక్షణాలతో కూడా ఫీవర్లు పెరుగుతున్నాయి. కొందరికీ వారం రోజుల లోపు తగ్గుతుండగా, మరికొందరికి నెల రోజులైనా తగ్గడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అయితే సీజనల్ మార్పులతో వచ్చే జ్వరాలతో ఎలాంటి టెన్షన్ లేదని డాక్టర్లు చెబుతున్నారు. లక్షణాలను బట్టి డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ వాడితో సరిపోతుందంటున్నారు. ఉదయం చలి, మధ్యాహ్నాం ఎండ, సాయంత్రం మళ్లీ చలి ఇలా విభిన్న వాతావరణ పరిస్థితులతోనూ ఫ్లూ సింప్టమ్స్‌తో కూడిన జ్వరం వేదిస్తున్నదని వైద్యులు తెలుపుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ మార్పుల సమయంలో ఫ్లూ ఫీవర్లు రావడం సహజమే. కానీ గతంతో పోల్చితే ఈ సారి ఎక్కువ రోజులు ఉంటున్నది. కరోనా(Corona) తర్వాత జనాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వలనే ఇలాంటి పరిస్థితి ఉన్నది. దగ్గు ఎక్కువ రోజులు ఉంటుంది. డాక్టర్లను సంప్రదించి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. అన్ని ఆస్పత్రుల్లోనూ జ్వరాలతో పేషెంట్లు క్యూ కడుతున్నారు. మరో వారం పాటు ఇలాంటి పరిస్థితి ఉండే చాన్స్ ఉన్నది.