Hussain Sagar | భాగ్యనగరంలో భారీ వర్షం.. హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద..
Hussain Sagar | హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటింది. ఫుట్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా, ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా కనిపిస్తుంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజల అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు […]
Hussain Sagar | హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటింది.
ఫుట్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా, ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా కనిపిస్తుంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజల అధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌లో 1100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు చేరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram