Edupayala Temple | జ‌ల‌దిగ్భందంలో ఏడుపాయ‌ల‌.. ఆల‌యాన్ని చుట్టుముట్టిన మంజీరా జ‌లాలు.. వీడియో

Edupayala Temple | మెద‌క్ జిల్లా( Medak District )లోని ఏడుపాయ‌ల( Edupayala ) వ‌న‌దుర్గా భ‌వానీ ఆల‌యం జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకుంది. ఆల‌యాన్ని మంజీరా న‌ది చుట్టుముట్టింది.

Edupayala Temple | జ‌ల‌దిగ్భందంలో ఏడుపాయ‌ల‌.. ఆల‌యాన్ని చుట్టుముట్టిన మంజీరా జ‌లాలు.. వీడియో

Edupayala Temple | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో.. వాగులు, వంక‌లు, చెరువులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మెద‌క్ జిల్లా( Medak District )లోని ఏడుపాయ‌ల( Edupayala Temple )వ‌న‌దుర్గా భ‌వానీ ఆల‌యం జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకుంది. ఆల‌యాన్ని మంజీరా న‌ది( manjira River ) చుట్టుముట్టింది. వ‌ర‌ద పోటెత్తిన కార‌ణంగా ఐదో రోజు కూడా ఏడుపాయ‌ల ఆల‌యాన్ని మూసివేశారు.

రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వ‌హించారు అర్చ‌కులు. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది ఉధృతి మ‌రింత పెరిగింది. దీంతో మంజీరా జ‌లాలు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి.

ఇక ఏడుపాయల ఆల‌యం వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఆల‌యం వైపున‌కు భ‌క్తులు వెళ్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆ వ‌ర‌ద ప్ర‌వాహం ఉధృతంగా ఉండ‌డంతో.. భ‌క్తుల‌ను పోలీసులు అల‌ర్ట్ చేస్తున్నారు. ఏడుపాయ‌ల ఆల‌యాన్ని చుట్టుముట్టిన మంజీరా న‌ది దృశ్యాల‌ను డ్రోన్ కెమెరాతో చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.