Edupayala| ఏడుపాయల వన దుర్గ భవాని వద్ద తగ్గిన మంజీరా వరద

మెదక్ ఏడుపాయల వన దుర్గ భవానీ ఆలయం వద్ధ మంజీరా నది వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలయ అధికారులు సంప్రోక్షణ తర్వాత గర్భగుడి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

Edupayala| ఏడుపాయల వన దుర్గ భవాని వద్ద తగ్గిన మంజీరా వరద

విధాత : మెదక్ ఏడుపాయల( Edupayala) వన దుర్గ భవానీ ఆలయం వద్ధ మంజీరా నది( Manjeera River) వరద ప్రవాహం తగ్గుముఖం(Flood Receded) పట్టింది. 23 రోజులుగా ఆలయ జలదిగ్భంధంలో ఉండటంతో. . ఆలయంలోకి బురద, చెత్త వచ్చి చేరింది. వరద ధాటికి గర్భాలయంలో వస్తువులు చిందర వందరంగా కొట్టుకెళ్లాయి. ఆలయం గ్రిల్స్, క్యూలైన్స్ బారికెడ్లు విరిగిపోగా..ఆలయం ఫ్లోర్ అంతా నాచుపట్టింది.

దీంతో ఆలయ అధికారులు సంప్రోక్షణ తర్వాత గర్భగుడి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆలయంలో మరమ్మతు, పరిశుభ్రత ఏర్పాట్లు చేపట్టారు. వరదల సమయంలో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజాధికాలు కొనసాగించారు.