ఏడుపాయల ఈవోగా కృష్ణ ప్రసాద్

మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ ఇవోగా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఏడుపాయల ఈవోగా కృష్ణ ప్రసాద్

కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలసిన ఈవో
సన్మానించిన ఆలయ చైర్మన్ బలగౌడ్

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ ఇవోగా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జ్‌ ఈవోగా పని చేసిన వినోద్ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఏసీగా నియమించడంతో ఆయనస్థానంలో కృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఏడుపాయల వన దుర్గామాత ఆలయ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కృష్ణ ప్రసాద్ మెదక్ కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు. ఆలయ చైర్మన్ బాలగౌడ్ నూతన ఈవోను శాలువాతో సన్మానించారు. ఆలయ అధికారులు సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.