Bhattacharya | ద‌వాఖాన నుంచి బుద్ధ‌దేవ్ డిశ్చార్జ్‌

Bhattacharya 11 రోజుల చికిత్స తర్వాత ఇంటికి ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ సీఎం విధాత‌: ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ద‌వాఖాన‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 'టైప్ 2' శ్వాసకోశ వైఫల్యం, వయసు సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 79 ఏళ్ల బుద్ధదేవ్ కోల్‌క‌తాలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో జూలై 29న చేరారు. 11 రోజుల చికిత్స తర్వాత బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంబులెన్స్‌లో ఆయ‌న‌ను పామ్ అవెన్యూ […]

  • By: Somu    latest    Aug 09, 2023 12:19 AM IST
Bhattacharya | ద‌వాఖాన నుంచి బుద్ధ‌దేవ్ డిశ్చార్జ్‌

Bhattacharya

  • 11 రోజుల చికిత్స తర్వాత ఇంటికి
  • ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ సీఎం

విధాత‌: ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ద‌వాఖాన‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ‘టైప్ 2’ శ్వాసకోశ వైఫల్యం, వయసు సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 79 ఏళ్ల బుద్ధదేవ్ కోల్‌క‌తాలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో జూలై 29న చేరారు. 11 రోజుల చికిత్స తర్వాత బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంబులెన్స్‌లో ఆయ‌న‌ను పామ్ అవెన్యూ నివాసానికి తీసుకెళ్లారు. ద‌వాఖాన వైద్యుల బృందం పర్యవేక్షణలో ఇంటి వద్ద బుద్ధ‌దేవ్ చికిత్స పొందుతార‌ని వైద్యులు తెలిపారు.

“బుద్ధ‌దేవ్ ఆరోగ్య‌ పరిస్థితి బాగానే ఉన్న‌ది. అయినప్పటికీ, ఆయ‌న‌ ఇంట్లో ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉంటారు. మా వైద్యుల బృందం ఆయ‌న‌ పరిస్థితిని కొంతకాలం పర్యవేక్షిస్తుంది ” అని సీనియ‌ర్ డాక్టర్ చెప్పారు. కొన్నేండ్లుగా ఆరోగ్యం క్షీణించడంతో బుద్ద‌దేవ్‌ ప్రజల‌కు దూరంగా ఉంటున్నారు. తన రెండు గదుల ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌కే పరిమితమయ్యాడు బుద్ధ‌దేవ్‌.

సీపీఎం సీనియర్ నేత జ్యోతిబసు నుంచి 2000 సంవ‌త్స‌రంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. 2011 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్య‌ర్థి చేతిలో బుద్ధదేవ్ ఓడిపోయారు. రాష్ట్రంలో 34 ఏండ్ల‌ సుదీర్ఘ సీపీఎం పాల‌న‌ ఆ సంవత్సరం ముగిసింది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు