Bhattacharya | మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత..
Bhattacharya విధాత: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య శనివారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను తన నివాసం నుంచి గ్రీన్ చానెల్ ద్వారా ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 79 ఏండ్ల వయసున్న భట్టాచార్య గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, కార్డియాలజిస్టులు, పల్మోనాలజిస్టుల […]

Bhattacharya
విధాత: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య శనివారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను తన నివాసం నుంచి గ్రీన్ చానెల్ ద్వారా ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 79 ఏండ్ల వయసున్న భట్టాచార్య గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ సమస్య మరింత తీవ్రమైంది.
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, కార్డియాలజిస్టులు, పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై భట్టాచార్యకు వైద్యం కొనసాగుతోంది.
భట్టాచార్యాలో ఆక్సిజన్ లెవల్స్ 70 శాతానికి పడిపోయాయి. భట్టాచార్య వెంట ఆయన భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలం నుంచి భట్టాచార్య ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా భట్టాచార్య పని చేశారు.