కారు దిగనున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే చిలుముల మధన్‌రెడ్డి కారు దిగాలని నిర్ణయించుకున్నారు.
- మైనంపల్లితో భేటీ
విధాత, హైదరాబాద్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే చిలుముల మధన్‌రెడ్డి కారు దిగాలని నిర్ణయించుకున్నారు. ఆయన మంగళవారం కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు మధన్‌రెడ్డి సిద్ధమయ్యారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 2014,2018ఎన్నికల్లో విజయం సాధించిన సిటింగ్ మధన్‌రెడ్డిని కాదని, నర్సాపూర్ టికెట్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా సునితాలక్ష్మారెడ్డికి ఇచ్చారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు మెదక్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు. తీరా మెదక్ ఎంపీ టికెట్‌ను మాజీ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మధన్‌రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారని, అందుకే మైనంపల్లిని కలిశారని తెలుస్తుంది. నర్సాపూర్ నుంచి బీఆరెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సునితాలక్ష్మారెడ్డి కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దీనిపై కేసీఆర్ స్పందించకపోవడంతో పార్టీలో ఉండి ప్రయోజనం లేదనుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మధన్‌రెడ్డి సిద్ధపడ్డారని అనుచవర్గాల కథనం. మధన్‌రెడ్డి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram