Gambhir | గంభీర్ చాలా తేడా మ‌నిషి.. అంద‌రితో గొడ‌వ‌ ప‌డ‌తాడు: ఆఫ్రిది

Gambhir | భార‌త మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ చాలా అగ్రెసివ్ అన్న సంగతి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయ‌న రిటైర్ అయిన కూడా ఆవేశం త‌గ్గ‌లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో గొడ‌వ‌ప‌డ‌డం మ‌నం చూశాం. గ‌తంలో కూడా కోహ్లీతో ప‌లుమార్లు గొడ‌వ‌కి దిగాడు గంభీర్. అయితే గంభీర్ ఒక్క కోహ్లీతోనే కాకుండా చాలా మంది ప్లేయ‌ర్స్‌తో గొడ‌వ‌లు ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే గంభీర్ ఏ రేంజ్‌లో ఊగొపోతాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. […]

  • Publish Date - August 14, 2023 / 11:03 AM IST

Gambhir |

భార‌త మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ చాలా అగ్రెసివ్ అన్న సంగతి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయ‌న రిటైర్ అయిన కూడా ఆవేశం త‌గ్గ‌లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో గొడ‌వ‌ప‌డ‌డం మ‌నం చూశాం. గ‌తంలో కూడా కోహ్లీతో ప‌లుమార్లు గొడ‌వ‌కి దిగాడు గంభీర్. అయితే గంభీర్ ఒక్క కోహ్లీతోనే కాకుండా చాలా మంది ప్లేయ‌ర్స్‌తో గొడ‌వ‌లు ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయి.

పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే గంభీర్ ఏ రేంజ్‌లో ఊగొపోతాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2007లో కాన్పూర్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జ‌ర‌గ‌గా, ఆ మ్యాచ్‌లో షాహిద్ ఆఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. కొట్టుకుంటారా ఏంట‌న్న‌ట్టు వారిద్ద‌రు గొడ‌వ ప‌డ్డారు.

అయితే షాహిద్, గంభీర్ ఈ ఏడాది ఆరంభంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకొని మంచిగానే మాట్లాడుకున్నారు. అయితే గంభీర్ ప్ర‌వర్త‌న ఇప్ప‌టికీ ఏం మార‌లేద‌ని అంటున్నాడు షాహిద్ ఆఫ్రిది.

గౌత‌మ్ గంభీర్ చాలా తేడా మ‌నిషిం. ఆయ‌న వ్య‌క్తిత్వం డిఫ‌రెంట్‌గా ఉంటుంది.అత‌ను నాతో మాత్ర‌మే కాదు అంద‌రితో గొడ‌వ‌లు ప‌డుతుంటాడు. భార‌త జ‌ట్టులో కూడా అత‌నిని డిఫ‌రెంట్‌గా చూస్తుంటారు. అత‌ను గొడ‌వ‌లు ప‌డే విధానం గురించి ఎక్కువ‌గా మాట్లాడుకోక‌పోవ‌డం మంచిది అని ఆయన అన్నారు.

ఇక బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌నలో అద్భుత‌మైన ప్ర‌తిభ ఉంది. బ్యాటింగ్ టైమింగ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. గంభీర్ బ్యాటింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇండియా టీంలో చాలా త‌క్కువ మందికి గంభీర్ లాంటి బ్యాటింగ్ టైమింగ్ ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు షాహిద్ ఆఫ్రిది.

గౌత‌మ్ గంభీర్ కెరీర్ చూస్తే ఆయ‌న 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గంభీర్ రిటైర్మెంట్ త‌ర్వాత రాజకీయాల‌లోకి వెళ్లి ఇప్పుడు ఢిల్లీ ఎంపీగా ఉన్నారు. అంతేకాదు లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Latest News