Game Changer | ఈ సినిమానే కంప్లీట్ కాలేదు.. మళ్లీ ఇదే కాంబినేషనా? నమ్మేదెలా మాస్టారూ?

Game Changer విధాత‌: ఓ హీరోతో ఓ దర్శకుడు పనిచేశాక.. మళ్ళీ అతనితోనే అదే దర్శకుడు పనిచేయడం అంటే అది దాదాపు అసాధ్యమే అందులోనూ అగ్రహీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావచ్చేమోగానీ, వెంట వెంటనే రిపీట్ అవడం జరిగేపనికాదు. అయితే జరుగుతున్న సినిమానే ఎప్పుడు విడుదల అవుతుందో తెలీక చస్తుంటే మళ్లీ ఆ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతున్నారనే న్యూస్ కాస్త వైరల్ గానే వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరనేనా సందేహం. […]

  • Publish Date - August 5, 2023 / 06:32 AM IST

Game Changer

విధాత‌: ఓ హీరోతో ఓ దర్శకుడు పనిచేశాక.. మళ్ళీ అతనితోనే అదే దర్శకుడు పనిచేయడం అంటే అది దాదాపు అసాధ్యమే అందులోనూ అగ్రహీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావచ్చేమోగానీ, వెంట వెంటనే రిపీట్ అవడం జరిగేపనికాదు.

అయితే జరుగుతున్న సినిమానే ఎప్పుడు విడుదల అవుతుందో తెలీక చస్తుంటే మళ్లీ ఆ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతున్నారనే న్యూస్ కాస్త వైరల్ గానే వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరనేనా సందేహం. ఆయనే స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా హీరో రామ్ చరణ్.

వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్‌డేట్స్ విషయమే సరిగా తెలీడం లేదు. వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్న ఈ మూవీ షెడ్యూల్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ.. ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. అదే ఓ కొలిక్కి రానప్పుడు ఇప్పుడు కొత్తగా మరో సినిమా వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతుందంటే అసలు నమ్మేలా ఉందా? అంటున్నారు ఫ్యాన్స్.

రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఆలస్యానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ మూవీ 2024 సంక్రాంతికి విడుదల కావాల్సింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు కూడా వచ్చేట్టులేదు. అదే సమయానికి దిల్ రాజు, విజయ్ దేవరకొండ సినిమా విడుదలయ్యేట్టుగా ఫ్లాన్ చేసుకున్నాడు. ఇక ‘గేమ్ ఛేంజర్’ 2024 సమ్మర్‌కైనా వస్తుందా? అంటే అదీ నమ్మకంగా చెప్పలేం.

ఎందుకంటే.. శంకర్ మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంటున్నాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్ 2’ సమ్మర్‌కి రానుందని..ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ ప్రకటించాడు. ఈ మూవీని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయనున్నాడు.

అందువల్ల ‘గేమ్ ఛేంజర్’ని వేరే సమయంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయనే టాక్ కూడా నడుస్తుంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ ఎలా ఉండబోతుందనే విషయం తెలియాలంటే ఆ సినిమా టీజర్ ఏదైనా విడుదలైతే కాస్తన్నా క్లారిటీ ఉంటుందని.. అప్పటి వరకూ ఏం నమ్మేట్టుగా లేదనేది సినీ జనాల టాక్. చూద్దాం మరి ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో.

Latest News