Gas Leakage | గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఏడుగురికి తీవ్రగాయాలు
Gas Leakage హైదరాబాద్: గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని దోమలగూడలో మంగళవారం చోటుచేసుకుంది. రోజ్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో పద్మ (55), ఆమె కూతురు […]
Gas Leakage
హైదరాబాద్: గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని దోమలగూడలో మంగళవారం చోటుచేసుకుంది. రోజ్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో పద్మ (55), ఆమె కూతురు ధనలక్ష్మి (30) ధనలక్ష్మి పిల్లలు అభినవ్ (8), శరణ్య (6), విహార్ (3), పద్మ చెల్లెలు నాగులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. భారీ ఆస్తి నష్టం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram