కల్లు గీస్తుండగా గుండెపోటు..తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి

కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి

కల్లు గీస్తుండగా గుండెపోటు..తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి

కల్లుగీతకు తాటి చెట్టుపైకి ఎక్కిన గీత కార్మికుడు గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గీత కార్మికుడు లక్ష్మయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందాడు. అయితే మోకు(ముస్తాగు)పైనే లక్ష్మయ్య చెట్టుపైనే వేలాడుతుండగా గమనించిన స్థానికులు భారీ క్రేన్ తెప్పించి అతడి మృతదేహాన్ని కిందకు దించారు.