Gold Loan | గోల్డ్ లోన్ కోసం చూస్తున్నారా..? ఏ బ్యాంకులో బంగారం రుణంపై ఎంత వడ్డీ ఉందంటే..?
ప్రస్తుతం బ్యాంకులన్నీ బంగారంపై లోన్లు జారీ చేస్తున్నాయి. ఈ లోన్ పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సైతం తక్కువే. బ్యాంకు, లోన్‌ను మొత్తాన్ని బట్టి రుణంపై వడ్డీ రేట్లు మారుతూ వస్తాయి

Gold Loan | ప్రస్తుతం బ్యాంకులన్నీ బంగారంపై లోన్లు జారీ చేస్తున్నాయి. ఈ లోన్ పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సైతం తక్కువే. బ్యాంకు, లోన్‌ను మొత్తాన్ని బట్టి రుణంపై వడ్డీ రేట్లు మారుతూ వస్తాయి. 18 క్యారెట్స్, 22 క్యారెట్స్ బంగారం ఆభరణాలతో పాటు గోల్డ్ కాయిన్స్‌పై సైతం లోన్స్ సైతం తాకట్టు పెట్టేందుకు అవకాశం ఉన్నది. బంగారం ప్యూరిటీ, బరువును బట్టి లోన్స్ జారీ చేస్తారు. కనీసం రూ.20వేలు గరిష్ఠంగా.. రూ.1.50కోట్లు లోన్లు జారీ చేస్తుంటాయి.
బంగారం వ్యాల్యూపై 65శాతం నుంచి 75శాతం వరకు గోల్డ్ లోన్ జారీ చేస్తుంది. లోన్లపై బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుండగా.. బ్యాంకులను బట్టి మారుతుంటుంది. హెయిర్ పిన్స్, మంగళసూత్రం, వైట్ గోల్డ్, గిన్నెలు, బంగారు కడ్డీలు, బంగారు పాత్రలు, గోల్డ్ స్ట్రాప్, కఫ్లింక్స్, గోల్డ్ వాచ్, డైమండ్ జ్యువెలరీ, రోల్డ్ గోల్డ్ నగలపై లోన్లు జారీ చేయవు. ప్రస్తుతం ఏ బ్యాంకులపై పసిడి రుణాలు వడ్డీ రేట్లు ఉంటాయి.. ప్రాసెసింగ్ ఛార్జీలు ఎలా ఉంటాయో చూద్దాం రండి..!
ఏ బ్యాంకులో వడ్డీ శాతం ఎంత ఉన్నాయంటే..
కొటక్ మహీంద్రా బ్యాంకులో అత్యల్పంగా 8 శాతం వడ్డీ నుంచి బంగారు రుణాలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా 24శాతం వరకు వడ్డీ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తం 2శాతం వరకు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 17.30శాతంగా ఉండగా.. ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45-8.55 వరకు వడ్డీ రేట్లు ఉండగా.. 0.50శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
యూకో బ్యాంకులో వడ్డీరేటు 8.50 శాతంగా ఉండగా.. ఇండియన్ బ్యాంకులో 8.65 శాతం నుంచి 9శాతంగా ఉంటుంది. యూనియన్ బ్యాంకులో 8.65 నుంచి 9.90 శాతంగా ఉండగా.. ఎస్‌బీఐలో గోల్డ్ లోన్లపై వడ్డీ రేటు 8.70 శాతంగా ఉన్నది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం ఉండగా.. అదనంగా జీఎస్టీ సైతం వర్తిస్తుంది. బంధన్ బ్యాంకులో 8.75 శాతం నుంచి 19.25 శాతంగా ఉండగా.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 8.85 శాతం, ఫెడరల్ బ్యాంకులో 8.99 శాతంగా ఉంటుంది.
సౌత్ ఇండియన్ బ్యాంకులో 9.01 నుంచి 22 శాతం ఉండగా.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 9.15 శాతం వసూలు చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 9.25 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 9.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 10 శాతం నుంచి 17.95 శాతంగా ఉన్నది. యాక్సిస్ బ్యాంకులో 17 శాతంగా వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.