Gold, Silver Price| వెండి ధర మరింత పైకి..తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయంగా అస్థిర పరిణామాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. సంక్రాంతి పర్వదినం రోజు గురువారం దేశంలో బంగారం ధరలు తగ్గిపోగా.. వెండి ధరలు మరింత పెరిగాయి.
విధాత: అంతర్జాతీయంగా అస్థిర పరిణామాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. సంక్రాంతి పర్వదినం రోజు గురువారం దేశంలో బంగారం ధరలు తగ్గిపోగా.. వెండి ధరలు మరింత పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.820తగ్గి రూ.1,43,180వద్ద ఆగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750తగ్గి రూ.1,31,250వద్ద నిలిచింది. గత 10రోజులలో 24క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.14,071పెరుగడం గమనార్హం.
వెండి ధరలు రూ.3లక్షల 10వేలు
వెండి ధరలు మాత్రం సంక్రాంతి రోజున కూడా దేశంలో మరింత పెరిగాయి. గురువారం కిలో వెండి ధర రూ.3000పెరిగి రూ.3,10,000కు చేరింది. జనవరి 1నుంచి ఇప్పటి వరకు రూ.54,000పెరిగిన తీరు వెండి ధరల పెరుగుదలకు నిదర్శనంగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ ఉద్రిక్తతలు, వెనిజూల పరిణామాలు, పారిశ్రామిక డిమాండ్, ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్లు వంటి అనేక అంశాలు వెండి ధరల పెరుగుదలకు కారణమతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram