Medaram Jatara : మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో 450 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన పోలీస్ నిఘా. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసంచారం పర్యవేక్షణ. సీఎం రేవంత్ రాకతో భద్రత మరింత కఠినం.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్.ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సర్వత్ర భారీ బందోబస్తుతో పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మేడారంలోని ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే సోమవారం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రాష్ట్ర ప్రభుత్వమే మేడారానికి తరలివచ్చి రెండు రోజులు బస చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లను చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటులు కొనసాగుతున్నాయి. మేడారంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అవసరమైన నిఘాను కొనసాగిస్తున్నారు. దీనికోసం జాతర ప్రాంతం అంతటా సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తదీన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు చేపట్టేందుకు అవసరమైన సన్నాహాలు చేపట్టారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించేవిధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
జాతరకు వచ్చే భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్., జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా, సంబంధిత అధికారులు తగినచర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Bhatti Vikramarka : ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు
GPS tracker Vulture| జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు దర్శనం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram