GPS tracker Vulture| జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు దర్శనం
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బైరాన్ దిబ్బ శివారులో అరుదైన రాబందు సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. రాబందు కాళ్లకు నెంబర్ జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో ఇదేదో గూఢచారి పక్షిగా అనుమానించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.
విధాత : అంతరించిపోతున్న పక్షిజాతుల జాబితాలోని రాబందు ఒకటి జీపీఎస్ ట్రాకర్ తో కనిపించడంతో ప్రజలు కలవరపడ్డారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బైరాన్ దిబ్బ శివారులో అరుదైన రాబందు సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. రాబందు కాళ్లకు నెంబర్ జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో ఇదేదో గూఢచారి పక్షిగా అనుమానించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని రాబందును పరిశీలించారు. దాని కాలికి ఉన్న జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా అది మహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. అంతరించిపోతున్న రాబందు జాతిని కాపాడేందుకు జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఫారెస్టు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (మేల్‌ఘాట్ ),మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి రాబందుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా జీపీఎస్ ట్రాకర్లు అమర్చి రాబందులను పర్యవేక్షిస్తున్నారని..అవి తమ సంచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram