Gold Rates: బంగారం తగ్గుదల బాటలోనే!

గతేడాది కాలంగా పెరుతుపోతున్న బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గుదల బాటలోనే సాగాయి. సోమవారం దేశీయ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.250తగ్గి రూ.82,850వద్ధ కొనసాగింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.280తగ్గి రూ.90,380వద్ధ నిలిచింది.

  • By: Somu    latest    Apr 07, 2025 11:04 AM IST
Gold Rates: బంగారం తగ్గుదల బాటలోనే!

Gold Rates: గతేడాది కాలంగా పెరుతుపోతున్న బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గుదల బాటలోనే సాగాయి. సోమవారం దేశీయ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.250తగ్గి రూ.82,850వద్ధ కొనసాగింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.280తగ్గి రూ.90,380వద్ధ నిలిచింది. బెంగుళూర్, చైన్నై, ముంబైలో అదే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.83,000గా, 24క్యారెట్లకు రూ.90,530గా ఉంది.

దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.79,056, 24క్యారెట్లకు రూ.85,411గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.78,820గా, 24క్యారెట్లకు రూ.83,960గా ఉంది.

వెండి ధరలు సైతం నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,03,000గా ఉంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో మూడు రోజుల్లో కిలో బంగారంపై రూ. 3000, వెండిపై కిలో రూ.9,100రూపాయలు తగ్గడం గమనార్హం.