Basmati Rice | బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం..! అక్రమ ఎగుమతులకు అడ్డకట్ట వేసేందుకే..!

Basmati Rice | దేశీయంగా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపడుతున్నది. అక్రమ ఎగుమతులపై కొరఢా ఝుళిపిస్తున్నది. బాస్మతీ ముసుగులో సాధారణ బియ్యం రవాణా చేస్తున్న వ్యాపారులకు షాక్‌ ఇచ్చింది. టన్ను ధర 1200 డాలర్ల కన్నా తక్కువ విలువైన బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రీమియం క్వాలిటీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది. టన్ను బాస్మతీ బియ్యం రేటు 1200 డాలర్లకన్నా తక్కువ ఉన్న కాంట్రాక్టులను […]

Basmati Rice | బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం..! అక్రమ ఎగుమతులకు అడ్డకట్ట వేసేందుకే..!

Basmati Rice |

దేశీయంగా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపడుతున్నది. అక్రమ ఎగుమతులపై కొరఢా ఝుళిపిస్తున్నది. బాస్మతీ ముసుగులో సాధారణ బియ్యం రవాణా చేస్తున్న వ్యాపారులకు షాక్‌ ఇచ్చింది. టన్ను ధర 1200 డాలర్ల కన్నా తక్కువ విలువైన బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రీమియం క్వాలిటీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది.

టన్ను బాస్మతీ బియ్యం రేటు 1200 డాలర్లకన్నా తక్కువ ఉన్న కాంట్రాక్టులను నమోదు చేయవద్దని ఏపీఈడీఏను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆ విలువలోపు ఇప్పటికే కుదుర్చుకున్న కాంటాక్టులపై ఏం చేయాలన్నదానిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

ధరలను నియంత్రించేందుకు, దేశీయంగా బియ్యం సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నది. గతేడాది సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులను నిషేధించిన కేంద్రం.. గత నెలలో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను బ్యాన్‌ చేసింది.

చివరి వారంలో పారాబాయిల్డ్‌ బాస్మతీయేతర బియ్యంపై 20శాతం సుంకం విధించింది. ఇకపై టన్నుకు 1200 డాలర్ల ధర మించి ఉంటేనే బాస్మతీ బియ్యం ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నారు. ఆ కాంట్రాక్టులకే రిజిస్ట్రేషన్‌ కమ్‌ అలొకేషన్‌ సర్టిఫికెట్‌ (RCAC) జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

సాధారణంగా టన్ను బాస్మతీ బియ్యం ఎగుమతి ధర సగటున 1214 డాలర్లు ఉంటుందని, ఈ నెలలో మాత్రం కాంటాక్టు ధర 359 డాలర్లుగా నమోదైందని, ఈ రెండింటి మధ్య చాలా తేడాలున్నట్లు గమనించామని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత తక్కువ ధర కాంటాక్టులను ఏం చేయాలో నిర్ణయిస్తారని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. భారత్‌ బాస్మతీ బియ్యం ఎగుమతుల విలువ 2022-23లో 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బాస్మతీయేతర బియ్యం విలువ 6.36 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందు ఏడాది నాటి 129.47 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 2022-23లో 135.54 మిలియన్‌ టన్నులకు బియ్యం ఉత్పత్తి పెరుగుతుందని వ్యవసాయ మంత్రిత్వశాఖ అంచనా వేసింది. తక్కువ వర్షాపాతంతో ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి తగ్గినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నది.