Warangal | ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు.. ముహూర్తం సమీపించడంతో హైరానా

Warangal | క్రేన్ సాయంతో బోల్తా పడ్డ ట్యాంకర్ తొలగింపు ఊపిరిపీల్చుకున్నపెళ్లి బృందం వరంగల్-ఖమ్మం రహదారిపై ఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకవైపు ట్రాఫిక్ దిగ్బంధనం, మరోవైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండగా పెళ్లికొడుకు హైరానా పడ్డాడు. బోల్తా పడ్డ ట్యాంకర్‌ని ఎప్పుడు తొలగిస్తారని ఆతృతతో ఎదురు చూశాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన గురువారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో ట్రాఫిక్ […]

  • By: Somu    latest    Sep 07, 2023 11:31 AM IST
Warangal | ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు.. ముహూర్తం సమీపించడంతో హైరానా

Warangal |

  • క్రేన్ సాయంతో బోల్తా పడ్డ ట్యాంకర్ తొలగింపు
  • ఊపిరిపీల్చుకున్నపెళ్లి బృందం
  • వరంగల్-ఖమ్మం రహదారిపై ఘటన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకవైపు ట్రాఫిక్ దిగ్బంధనం, మరోవైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండగా పెళ్లికొడుకు హైరానా పడ్డాడు. బోల్తా పడ్డ ట్యాంకర్‌ని ఎప్పుడు తొలగిస్తారని ఆతృతతో ఎదురు చూశాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన గురువారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ ట్రాఫిక్‌లో తన పెళ్లి కోసం వెళ్తున్న వరుడు చిక్కుకున్నాడు. ముహూర్తం దగ్గర పడుతున్నా, ట్రాఫిక్ తగ్గలేదు. బోల్తా పడ్డ ట్యాంకర్‌ అక్కడే ఉండిపోయింది. తొర్రూరులో తన పెళ్లి ఉదయం 10 గంటలకు ఉందని, ముహూర్తం సమయానికి వెళ్లేందుకు తాను వాహనంలో వెళ్తుండగా, ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్లు వరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ జామ్ అయిన సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. భారీ క్రేన్ సహాయంతో బోల్తా పడ్డ ట్యాంకర్ ను పక్కకు తొలగించారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. దాదాపు గంటపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల చొరవతో పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఊపిరి పీల్చుకున్నారు.