గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల.. ఆ 5 ప్రశ్నలు తొలగింపు
Group-1 Final Key | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి విడుదల చేసిన విషయం విదితమే. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16 వ తేదీన నిర్వహించారు. అదే నెల 29న ప్రాథమిక విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలపై నిపుణుల కమిటీ చర్చించిన అనంతరం నిన్న తుది కీని విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అయితే 150 […]

Group-1 Final Key | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి విడుదల చేసిన విషయం విదితమే. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16 వ తేదీన నిర్వహించారు. అదే నెల 29న ప్రాథమిక విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలపై నిపుణుల కమిటీ చర్చించిన అనంతరం నిన్న తుది కీని విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అయితే 150 ప్రశ్నల్లో 5 ప్రశ్నలను తొలగించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మిగతా 145 ప్రశ్నలకు.. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు ఇవ్వనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు సెలెక్ట్ అవుతారు. ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని గతంలోనే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నది.