1,365 పోస్టుల‌తో గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విధాత‌: తెలంగాణలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ల వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. నిన్న గ్రూప్-2, నేడు గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. నిన్న 768 పోస్టుల‌తో గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా, ఇవాళ 1365 పోస్టుల‌తో గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం http://www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. ఇప్ప‌టికే గ్రూప్-1, గ్రూప్-4 […]

  • Publish Date - December 31, 2022 / 04:44 AM IST

విధాత‌: తెలంగాణలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ల వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. నిన్న గ్రూప్-2, నేడు గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. నిన్న 768 పోస్టుల‌తో గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా, ఇవాళ 1365 పోస్టుల‌తో గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం http://www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

ఇప్ప‌టికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేష‌న్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. ఇక గ్రూప్-4 నోటిఫికేష‌న్‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది.

హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది.

Latest News