సోహైల్‌ను పెళ్లాడనున్న హన్సిక.. ఫోటోలు షేర్ చేసిన నటి

విధాత: ముంబై భామ హన్సిక ఒంటరి జీవితానికి త్వరలోనే స్వస్తి పలుకబోతోంది. త్వరలోనే మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఇల్లాలు కాబోతోంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లాడనుంది హన్సిక. పెళ్లికి సంబంధించిన వివరాలను హన్సికనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా తన కలల రాకుమారుడి ఫోటోలను ఆ భామ షేర్ చేసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్‌తో దిగిన ఫోటోలను హన్సిక షేర్ చేశారు. అతని లవ్‌కు అంగీకారం తెలిపిన […]

సోహైల్‌ను పెళ్లాడనున్న హన్సిక.. ఫోటోలు షేర్ చేసిన నటి

విధాత: ముంబై భామ హన్సిక ఒంటరి జీవితానికి త్వరలోనే స్వస్తి పలుకబోతోంది. త్వరలోనే మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఇల్లాలు కాబోతోంది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లాడనుంది హన్సిక. పెళ్లికి సంబంధించిన వివరాలను హన్సికనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా తన కలల రాకుమారుడి ఫోటోలను ఆ భామ షేర్ చేసింది.

పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్‌తో దిగిన ఫోటోలను హన్సిక షేర్ చేశారు. అతని లవ్‌కు అంగీకారం తెలిపిన ఫోటోలను కూడా షేర్ చేసింది హన్సిక. ఇక ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని రాజకోటలో వీరి వివాహం జరగనుంది. డిసెంబర్ 2న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, 3న మెహందీ, సంగీత్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

దేశముదురు మూవీతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న హన్సిక.. ఇప్పటి వరకు 50 సినిమాల్లో నటించారు. హన్సిక నటించిన పార్ట్ నర్, 105 మినట్స్ సినిమా షూటింగ్స్ పూర్తి కాగా, తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి, తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.