Ayodhya | అయోధ్యలో నిర్మిస్తున్న.. రామాలయం గర్భగుడి చూశారా?

రామ జన్మభూమిగా చెబుతున్న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70శాతానికి పైగా పనులు పూర్తయినట్టు తెలుస్తున్నది. తాజాగా రామాలయం గర్భగుడి నిర్మాణ పనుల ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) రామ మందిర నిర్మాణ పనులు అత్యంత‌ వేగంగా పూర్తవుతున్నాయి. అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఆలయంలోని గర్భగుడి (garbha griha) చిత్రాన్ని రామజన్మ భూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ (Champat Rai) శుక్రవారం సామాజిక మాధ్యమంలో […]

Ayodhya | అయోధ్యలో నిర్మిస్తున్న.. రామాలయం గర్భగుడి చూశారా?

రామ జన్మభూమిగా చెబుతున్న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 70శాతానికి పైగా పనులు పూర్తయినట్టు తెలుస్తున్నది. తాజాగా రామాలయం గర్భగుడి నిర్మాణ పనుల ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) రామ మందిర నిర్మాణ పనులు అత్యంత‌ వేగంగా పూర్తవుతున్నాయి. అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఆలయంలోని గర్భగుడి (garbha griha) చిత్రాన్ని రామజన్మ భూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ (Champat Rai) శుక్రవారం సామాజిక మాధ్యమంలో పెట్టారు. అయోధ్య రామాలయం అనుకున్న సమయానికే పూర్తవుతుందని, 2024 నాటికి భక్తుల దర్శనాల కోసం తెరుచుకుంటుందని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ చెబుతున్నారు.

నిర్మాణ పనులు 70 శాతం పూర్తి

ఆలయ నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటి వరకు 70శాతం పనులు పూర్తయ్యాయని శ్రీ రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహారాజ్‌ చెప్పారు. 2024 జనవరి మూడో వారానికి రామ్‌లల్లా (Ramlalla) విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని ఆయన తెలిపారు. ఆ రోజు నుంచే భక్తులు దర్శించుకునేందుకు, పూజలు చేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు చెప్పారు.

నేపాల్‌ నుంచి శాలిగ్రామ శిలలు

బృహత్‌రామాలయంలో రాముడు, సీత విగ్రహాలను చెక్కేందుకు రెండు సాలిగ్రామ శిలలను (Shaligrams) నేపాల్‌ నుంచి ఇటీవలే తెప్పించారు. నేపాల్‌లోని కాళీగండకి నది సమీపాన లభించే శిలలు ప్రపంచంలోనే అత్యంత అపురూపమైనవిగా చెబుతుంటారు. ఇవి సాక్షాత్తూ విష్ణు స్వరూపాలేనని భక్తకోటి నమ్ముతుంటుంది.