మూడేండ్ల బాలుడు నరబలి.. తల లేని మొండెం లభ్యం
Human Sacrifice | ఓ మూడేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. ఓ చేయిని కూడా నరికేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ప్రీత్ విహార్‌కు చెందిన ఓ మూడేండ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి నవంబర్ 30వ తేదీన కిడ్నాప్ చేశాడు. బాలుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. […]

Human Sacrifice | ఓ మూడేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. ఓ చేయిని కూడా నరికేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ప్రీత్ విహార్‌కు చెందిన ఓ మూడేండ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి నవంబర్ 30వ తేదీన కిడ్నాప్ చేశాడు. బాలుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే యూపీ మీరట్ పరిధిలోని చెరుకు తోటలో తల లేని మొండెంను స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పడి ఉన్న వస్తువులు, దుస్తుల ఆధారంగా ప్రీత్ విహార్‌లో కిడ్నాపైన బాలుడిగా పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం.. ప్రీత్ విహార్‌లో వారి ఇంటి పక్కనే ఉంటున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
తానే బాలుడిని నరబలి ఇచ్చినట్లు అంగీకరించాడు. మీరట్ చెరుకు తోటల్లోకి తీసుకెళ్లి హత్య చేశానని ఒప్పుకున్నాడు. మొండెం నుంచి తలను, ఓ చేయిని వేరు చేశానని తెలిపాడు. మొండెంకు కొంచెం దూరంలోనే తల, చేతి లభ్యమైంది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.