Rains | ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. ప్రధాని మోడీ సమీక్ష

Rains | విధాత: ఉత్తర భారత రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. హర్యానా, పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, ఢిల్లీ రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల ధాటికి యమునా, సట్లెజ్‌, స్వాన్, చినాబ్‌, బియాస్ నదులు ఉప్పోంగడంతో వరదలతో భారీ నష్టం వాటిల్లుతుంది. కొండ ఛరియలు విరిగిపడగా, రోడ్డులు, వంతెనలు కొట్టుకపోయాయి. జమ్మూ కాశ్మీర్ లోని కథువా్‌, సాంబా జిల్లాలో వరదల ఉదృతి ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే 15మంది మృతి చెందారు. […]

  • By: Somu    latest    Jul 10, 2023 11:50 AM IST
Rains | ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. ప్రధాని మోడీ సమీక్ష

Rains |

విధాత: ఉత్తర భారత రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. హర్యానా, పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, ఢిల్లీ రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల ధాటికి యమునా, సట్లెజ్‌, స్వాన్, చినాబ్‌, బియాస్ నదులు ఉప్పోంగడంతో వరదలతో భారీ నష్టం వాటిల్లుతుంది.

కొండ ఛరియలు విరిగిపడగా, రోడ్డులు, వంతెనలు కొట్టుకపోయాయి. జమ్మూ కాశ్మీర్ లోని కథువా్‌, సాంబా జిల్లాలో వరదల ఉదృతి ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే 15మంది మృతి చెందారు.

వరదల కారణంగా శ్రీఖండ్ యాత్రను నిలిపివేశారు. ఆయా రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరాదిలో వరదల బీభత్సంపై సమీక్ష నిర్వహించి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ప్రభుత్వాలను, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఢిల్లీలో వరదల పరిస్థితి, సహాయ చర్యలపై సీఎం కేజ్రీవాల్ అధికార యంత్రాంగంతో అత్యవసర భేటీ నిర్వహించారు. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంంతో ప్రజలను అప్రమత్తం చేశారు.