High Court | పిటిషనర్లనూ ప‌రీక్ష‌కు అనుమ‌తించండి: హైకోర్టు

High Court హైద‌రాబాద్‌, విధాత: జిల్లా న్యాయమూర్తుల పరీక్షలకు పిటిషనర్లనూ అనుమతించాలని, ఫలితాల వెల్లడి మాత్రం తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా న్యాయమూర్తుల నియామకం కోసం ఏప్రిల్‌ 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో రాత పరీక్ష జరుగనుంది. అయితే తాము పరీక్ష కోసం దరఖాస్తు చేసినా.. కారణం తెలుపకుండా తిరస్కరించారని, పరీక్షకు తమను అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన […]

High Court | పిటిషనర్లనూ ప‌రీక్ష‌కు అనుమ‌తించండి: హైకోర్టు

High Court

హైద‌రాబాద్‌, విధాత: జిల్లా న్యాయమూర్తుల పరీక్షలకు పిటిషనర్లనూ అనుమతించాలని, ఫలితాల వెల్లడి మాత్రం తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా న్యాయమూర్తుల నియామకం కోసం ఏప్రిల్‌ 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో రాత పరీక్ష జరుగనుంది.

అయితే తాము పరీక్ష కోసం దరఖాస్తు చేసినా.. కారణం తెలుపకుండా తిరస్కరించారని, పరీక్షకు తమను అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పల్లి హేమలత మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లను పరీక్షకు అనుమతించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.