Boycott | ప్రైవేట్‌ విద్యాసంస్థల సమాఖ్య మరో కీలక నిర్ణయం!

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (Consortium of Private Educational Institutions) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల నిరవధిక బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో, సమాఖ్య తాజాగా తమ నిరసనను ఉధృతం చేసింది. రేపటి (నవంబర్‌ 4) నుంచి అన్ని పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

Boycott | ప్రైవేట్‌ విద్యాసంస్థల సమాఖ్య మరో కీలక నిర్ణయం!

విధాత, హైదరాబాద్ :

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (Consortium of Private Educational Institutions) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల నిరవధిక బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో, సమాఖ్య తాజాగా తమ నిరసనను ఉధృతం చేసింది. రేపటి (నవంబర్‌ 4) నుంచి అన్ని పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 8న హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల సిబ్బందితో సమాఖ్య సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే, నవంబర్‌ 11న దాదాపు 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహించబోతున్నట్లు సమాఖ్య చైర్మన్‌ రమేశ్ బాబు వెల్లడించారు.

తమ డిమాండ్స్‌ నెరవేర్చేవరకు బంద్‌ కొనసాగుతుందని స్పష్టిం చేశారు. బకాయిల్లో కనీసం 50 శాతం అయినా విడుదల చేస్తేనే సమ్మెను విరమిస్తామని తెలిపారు. రూ. 5 వేల కోట్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు అని రమేశ్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు మొత్తం రూ. 9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్లు సమాఖ్య వెల్లడించింది. గతంలో జరిగిన చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీపావళి లోగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదలైనట్లు చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు వెంటనే చెల్లించాలంటూ సమాఖ్య మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బంద్‌ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, డిగ్రీ, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలల్లో పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తుపై విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.