కలెక్షన్ల వర్షం కురిపించిన బాయ్‌కాట్‌ ‘పఠాన్‌’..! కలిసొచ్చిన ట్రోలింగ్‌

విధాత: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతున్నాడు. ఈ చిత్రానికి ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సిద్ధార్థ ఆనంద్ దర్శకుడు. ఈ మూవీతో డీలపడిన బాలీవుడ్ ను షారుక్ ఖాన్ కాపాడుతాడని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రంతో మ‌ర‌లా బాలీవుడ్ సినిమాలను గాడిలో పెట్టే బాధ్యత షారుఖ్ పై పడిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పలు ట్రోల్స్ కి గుర‌యింది. దీపికా పడుకొనే […]

  • By: krs    latest    Jan 30, 2023 8:46 AM IST
కలెక్షన్ల వర్షం కురిపించిన బాయ్‌కాట్‌ ‘పఠాన్‌’..! కలిసొచ్చిన ట్రోలింగ్‌

విధాత: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతున్నాడు. ఈ చిత్రానికి ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సిద్ధార్థ ఆనంద్ దర్శకుడు. ఈ మూవీతో డీలపడిన బాలీవుడ్ ను షారుక్ ఖాన్ కాపాడుతాడని అందరూ భావిస్తున్నారు.

ఈ చిత్రంతో మ‌ర‌లా బాలీవుడ్ సినిమాలను గాడిలో పెట్టే బాధ్యత షారుఖ్ పై పడిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పలు ట్రోల్స్ కి గుర‌యింది. దీపికా పడుకొనే బికినీ వేయడం, ఆ బికినీ కాషాయం రంగులో ఉండడం ఆమె ప్రవేట్ పార్ట్ మీద షారుక్ చేతులు వేయడం వంటివి అసభ్యంగా కనిపించాయి. ముఖ్యంగా బేష‌ర‌మ్ సాంగ్ పై హిందూ సంఘాలు మండిపడ్డాయి.

బాయ్ కాట్ పఠాన్.. బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదాలు కూడా జోరందుకున్నాయి. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఏకంగా హిందూ సాధువులు రోడ్డు ఎక్కారు. ఇవన్నీ చిత్రానికి మైనస్లు కాకపోగా ప్లస్ పాయింట్ గా మిగిలాయి. ఈ చిత్రానికి ఇవి ఉచితమైన పబ్లిసిటీని కల్పించాయి. పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా వైర‌ల్ అయింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో అసలు ఏముంది అని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఈ చిత్రం తన జోరును చూపిస్తూ వస్తోంది. షారుక్ ఖాన్ సినిమా కావడంతో కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలబడ్డారు. అయితే ఈ చిత్రంలోని లొసుగుల‌ను వెతుకుతూ మరికొందరు ఇప్పుడు కొత్తగా ట్రోల్స్ మొదలు పెడుతున్నారు.

దీపిక పడుకొనేను పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్గా చూపించారు. ముందు ఇండియాకు విరుద్ధంగా ఉండే హీరోయిన్ ఆ తరువాత పఠాన్‌తో కలిసి ఇండియాను రక్షించడం అనేది పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. ఇక విలన్‌గా నటించిన జాన్ అబ్రహంని మాజీ రా ఏజెంట్గా పరమవీరచక్ర దక్కించుకున్న వ్యక్తిగా చూపించారు.

తన ఫ్యామిలీని సైన్యం కాపాడలేక పోయిందన్న అకస్సుతో సదరు జవాన్ దేశద్రోహిగా మారి విద్రోహులతో చేతులు కలిపి దేశం పైన యుద్ధానికి దిగినట్టు చూపించారు. అయితే అతనికి సహాయపడే వ్యక్తిగా హిందూని చూపించి తప్పు చేశారు. ఈ పాయింట్లను లేవ‌నెత్తుతూ మరలా బాయ్ కాట్ ప‌ఠాన్ అని నానా హంగామా చేస్తున్నారు. ఇలా ఈ చిత్రానికి అనుకోకుండా ఉచిత పబ్లిసిటీ లభిస్తుందని చెప్పవచ్చు.