Shivadhar Reddy : తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్

తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. ఇంచార్జ్ డీజీపీ నియామకాన్ని తప్పుబట్టలేమని స్పష్టం.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 05, 2026, 1:14 pm IST
Read Time: 4 mins
Shivadhar Reddy : తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీజేఐ సూర్యాకంత్ ధర్మాసనం ఏకీభవించింది. ఇంచార్జ్ డీజీపీ నియామకాన్ని తప్పుబట్టలేమని.. నియామక ప్రక్రియ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం నికరాకరించింది.

పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని UPSCకి ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.

రాష్ట్రాల ఆలస్యంతో మెరిట్ అధికారులకు అన్యాయం

నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలన్న ధర్మాసనం.. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.ఈ ఆలస్యం కారణంగా మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందన్న సుప్రీంకోర్టు మండిపడింది. యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే.. త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదు అని సుప్రీంకోర్టు హెచ్చరించడం ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి :

Telangana Gram Panchayat Funds | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..నిధులొచ్చాయ్ !
Mega Movies | స‌మ్మ‌ర్ అంతా మెగా హీరోల‌దే.. నెల గ్యాప్‌తో సంద‌డి చేయ‌నున్న స్టార్ హీరోలు