KTR | బాధితకుటుంబానికి కేటీఆర్ అండ .. రూ.5లక్షల ఆర్థిక సహాయం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ఇటీవల ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మాజీమంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. బీఆరెస్ పార్టీ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు

విధాత, వరంగల్ ప్రతినిధి:వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ఇటీవల ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మాజీమంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. బీఆరెస్ పార్టీ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన బాధితులు దీపిక, మధన్ లాల్ పిల్లలిద్దరీ చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ బాధిత కుటుంబానికి మానవతా ధృక్పథంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు అందిచాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న దంపతులు పాల్గొన్నారు.
**