Pawan Kalyan | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ .. రెండో పాటలో ప‌వ‌న్ ఎలివేష‌న్ పీక్స్‌లో ఉంటుందా?

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం ప్రత్యేకం. థియేటర్ల వద్ద జరిగే సంబరాలు, పూనకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ హడావుడి బాక్సాఫీస్‌కు కొత్త వైబ్ తీసుకొస్తుంది. ఇటీవల ‘ఓజీ’ అప్‌డేట్స్‌తో ఉత్సాహంలో ఉన్న అభిమానులు ఇప్పుడు పూర్తిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై దృష్టి సారించారు.

  • By: sn |    movies |    Published on : Feb 08, 2026 12:13 PM IST
Pawan Kalyan  | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ .. రెండో పాటలో ప‌వ‌న్ ఎలివేష‌న్ పీక్స్‌లో ఉంటుందా?

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం ప్రత్యేకం. థియేటర్ల వద్ద జరిగే సంబరాలు, పూనకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ హడావుడి బాక్సాఫీస్‌కు కొత్త వైబ్ తీసుకొస్తుంది. ఇటీవల ‘ఓజీ’ అప్‌డేట్స్‌తో ఉత్సాహంలో ఉన్న అభిమానులు ఇప్పుడు పూర్తిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై దృష్టి సారించారు. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించి అభిమానులకు మరపురాని అనుభూతిని ఇచ్చింది. చాలా సంవత్సరాల విరామం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే స్థాయి మ్యాజిక్ సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తలతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న భారీ స్థాయిలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మెగా అభిమానులకు ఇది ముందస్తు పండుగగా మారనుందనే టాక్ వినిపిస్తోంది.

‘గబ్బర్ సింగ్’లో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, పవన్ వేసిన మాస్ స్టెప్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. అదే ఫార్ములాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాటలో పవన్ స్టెప్స్ అభిమానులను ఆకట్టుకోగా, ఇప్పుడు రెండో పాట అప్‌డేట్ రావడంతో హైప్ మరింత పెరిగింది.

“ఏ తరమైనా నీ తరమే… మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే…” అంటూ సాగే లిరిక్స్ పవన్ మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేస్తాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ఈ పాటలు థియేటర్లలో అభిమానులతో పూనకాల రచ్చ చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందనే నమ్మకం బలపడుతోంది. సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే.