అందుకేనా.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం: బీఆర్ఎస్ కీలక ఆరోపణలు
హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. కీలక కేసుల ఆధారాలు నాశనం చేయడానికే కుట్ర పన్నారా? అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఆధారాలను ధ్వంసం చేయడానికే ఈ కుట్ర పన్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. లేక కాంగ్రెస్ రాజకీయ క్రీడలో భాగమైన ఫోన్ టాపింగ్ కేసులో లేని ఆధారాలు నాశనం అయ్యాయని కప్పిపుచ్చడానికా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడాన్ని చూస్తే.. అవే అనుమానాలు కలుగుతున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తుంది.
నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో లో మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎస్ ఎల్ ల్యాబ్‌లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు, సీజ్ చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు వంటి వాటిని భద్రపరిచారు.ఇక్కడే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు.. గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్.. ఇదే ల్యాబ్‌లోనే మొయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఫైల్స్ భద్రపరిచినట్లుగా సమాచారం.
అగ్నిప్రమాదంలో పలు కేసుల్లో సీజ్ చేసిన ప్రాపర్టీ దగ్ధమైంది. అలాగే పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. కీలకమైన పలు కేసుల్లో సీజ్ చేసిన 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయి. మరో రూమ్‌లో స్టోర్ చేసిన హార్డ్ డిస్క్‌లు పూర్తిగా కాలిపోయాయి. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో రాష్ట్రంలోని పలు కేసులకు సంబంధించిన కీలక సమాచారం దాదాపుగా ఇక్కడే భద్రపరిచారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మంచిపేరు ఉంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
I am guessing the voice recordings of the famous “Vote for Note” case
And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj
— KTR (@KTRBRS) February 7, 2026
ఇవి కూడా చదవండి :
Telangana Municipal Elections : ‘మధ్యంతర పరీక్ష’గా మారిన మున్సిపోల్స్
Nose Pin | మహిళలూ బీ కేర్‌ఫుల్.. ముక్కుపుడకతో ప్రాణాలకే ముప్పు..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram