Chhattisgarh Encounter : ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతం !

ఆపరేషన్ కగార్‌లో భాగంగా బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు. మావోయిస్టు కమాండర్ ఉదమ్ సింగ్ హతం.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 05, 2026, 1:29 pm IST
Read Time: 2 mins
Chhattisgarh Encounter : ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతం !

విధాత: ఛత్తీస్‌గఢ్-బీజాపూర్ జిల్లా పెద్దగళూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత, కమాండర్ ఉదమ్ సింగ్ ఉన్నట్లుగా భద్రతాధికారులు వెల్లడించారు. పెద్దగళూరు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుండగా..
భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Gaddar Film Awards | ఉగాది సందర్భంగా గద్దర్ ఫిల్మ్ అవార్డులు … మార్చి 19న ప్రదానోత్సవం :భట్టి విక్రమార్క
Chicken | నాన్ వెజ్ ప్రియుల‌కు ఊర‌ట‌.. త‌గ్గిన కోడి కూర ధ‌ర‌లు..!