Maoists | ఇకనైనా ‘అడవి’ని వీడు బిడ్డా..! మావోయిస్టుకు ఓ తండ్రి భావోద్వేగ సందేశం
Maoists | అన్నలు అడవిని వీడుతున్నారు.. చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇంకా మీరేందుకు ఆ అడవిలో కష్టాలు పడుతారు. మీరు కూడా వచ్చి ప్రజల్లో కలిసిపోండి.. ఇకనైనా అడవిని వీడు బిడ్డా..! అంటూ ఓ మావోయిస్టు( Maoists )కు ఓ తండ్రి భావోద్వేగంతో కూడిన సందేశం పంపిండు.

మహారాష్ట్ర( Maharashtra )లోని గడ్చిరోలి( Gadchiroli ) పరిధిలో మావోయిస్టులందరూ లొంగిపోయారు. ఇక మిగిలింది ఆరుగురు మావోయిస్టులే. ఈ ఆరుగురిలో ఒకరు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన జయరాం అలియాస్ నందు మోంగే గవాడే. మిగతా ఐదుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు. మావోయిస్టులందరూ లొంగిపోతున్న క్రమంలో జయరాం ఇప్పటికీ లొంగిపోలేదు. ఈ క్రమంలో జయరాం తండ్రి మోంగే గవాడేను ఓ ఆంగ్ల మీడియా సంప్రందించింది.
14 ఏళ్ల క్రితం అడవి బాట..
14 ఏళ్ల క్రితం నా కొడుకు వయసు 17 ఏండ్లు. ఆ వయసులో ఇంటి పనుల్లో నిర్లక్ష్యం వహించేవాడు. ఏ పని చేయకుండా.. ఖాళీగా ఉండేవాడు. ఇంటి పనులు చక్కబెట్టుకోవాలని ఒక రోజు తిట్టడంతో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక అప్పుడు అడవి బాట పట్టిన నా బిడ్డా.. ఇప్పటికీ ఒక్కసారి కూడా తిరిగిరాలేదు. నన్ను చూడలేదు అని కన్నీరు పెట్టుకున్నాడు తండ్రి.
ఇప్పుడు మీ దళంలో ఉన్న సహచరులందరూ లొంగిపోయారు. అలాంటప్పుడు నువ్వు ఒక్కడివే అడవిలో ఉంటున్నావ్.. కష్టాలను ఎందుకు భరిస్తున్నావ్.. భుజాన ఉన్న తుపాకీని నేలపై పెట్టి.. జనజీవన స్రవంతిలో కలిసిపో బిడ్డా.. నీ రాక కోసం ఎదురుచూస్తున్నా అని తండ్రి బోరున విలపించాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram