High Court | టీడీపీ నేత JC ప్రభాకర్‌రెడ్డికి.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

High Court ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉన్న‌త ధ‌ర్మాస‌నం హైద‌రాబాద్‌, విధాత: బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేపట్ట‌లేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ మేరకు అధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెలలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ […]

High Court | టీడీపీ నేత JC ప్రభాకర్‌రెడ్డికి.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

High Court

  • ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉన్న‌త ధ‌ర్మాస‌నం

హైద‌రాబాద్‌, విధాత: బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేపట్ట‌లేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ మేరకు అధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెలలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలకు చెందిన దివాకర్ ట్రావెల్స్‌ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు చేయడమే కాకుండా పలు వాహనాలను సీజ్‌ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

ఈ నేపథ్యంలో బీఎస్‌ -3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి నడపడంపై తాను 2020, అక్టోబర్‌ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాడిపత్రి ఎమ్మెల్యే కె.పెద్దారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, అక్రమాలు తేలడంతో పలు వాహనాలను సీజ్‌ చేశారని పేర్కొన్నారు.

తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారన్నారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విచారణ జరిపి.. కేసు నమోదు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులు తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్‌, డీజీపీ, సీబీఐలతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, త‌దుపరి విచారణను వాయిదా వేశారు.