Highest Temperature | వచ్చే ఐదేళ్లూ సూర్యుని ప్రతాపమే
విధాత: ఉక్కపోతతో ఉడికిపోవడం ఇక సర్వసాధారణం కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరిస్తోంది. రానున్న ఐదేళ్ళూ ఎండలు విపరీతంగా (Highest temperature) ఉంటాయని, వాడాగాలులు సర్వ సాధారణం కానున్నాయని నివేదిక లో పేర్కొంది. వాటిలో ఏదో ఒక సంవత్సరం… మానవ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కనుందని తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రత పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్‌ను మన భూమి బద్దలు కొట్టనుందని తేల్చి చెప్పింది. శిలాజ ఇంధనాల వినియోగం, ఎల్‌నినో పరిస్థితులే ఈ […]
విధాత: ఉక్కపోతతో ఉడికిపోవడం ఇక సర్వసాధారణం కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరిస్తోంది. రానున్న ఐదేళ్ళూ ఎండలు విపరీతంగా (Highest temperature) ఉంటాయని, వాడాగాలులు సర్వ సాధారణం కానున్నాయని నివేదిక లో పేర్కొంది. వాటిలో ఏదో ఒక సంవత్సరం… మానవ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కనుందని తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రత పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్‌ను మన భూమి బద్దలు కొట్టనుందని తేల్చి చెప్పింది. శిలాజ ఇంధనాల వినియోగం, ఎల్‌నినో పరిస్థితులే ఈ విపత్తుకు దారి తీయనున్నాయని వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి వనరుల లభ్యత, పర్యావరణంపై పెను ప్రభావం చూపించనున్నాయని డబ్ల్యూఎంవో నివేదిక స్పష్టం చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram