Nandyala: నంద్యాల.. నడిరోడ్డుపై హిజ్రాల గ్యాంగ్ బీభత్సం!
నంద్యాలలో చోటుచేసుకున్న హిజ్రాల గ్యాంగ్ వార్ వైరల్ గా మారింది. ఏరియాల వారిగా బిక్షాటన విషయంలో తలెత్తిన వివాదంలో రెచ్చిపోయిన హిజ్రాల గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే రోడ్ల మీదనే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించారు.

Hijras Gang War:
హిజ్రాల ఆగడాలు మితిమీరడం ఇటీవల కాలంలో తరుచుగా చూస్తున్నాం. పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్లకు కూడా ఎక్కిన ఘటనలు ఉన్నాయి. తాజాగా నంద్యాలలో చోటుచేసుకున్న హిజ్రాల గ్యాంగ్ వార్ వైరల్ గా మారింది. ఏరియాల వారిగా బిక్షాటన విషయంలో తలెత్తిన వివాదంలో రెచ్చిపోయిన హిజ్రాల గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే రోడ్ల మీదనే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించారు.
బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల గ్రూపు ల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. నంద్యాలలో బిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తుండగా..దీనిని నంద్యాల హిజ్రాలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నంద్యాల రూరల్ పీఎస్ ముందు ఎదురుపడ్డ రెండు వర్గాలు పరస్పరం బూతులు తిట్టుకుంటు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకొని రాళ్లు రువ్వుకుని ఘర్షణకు దిగారు. హిజ్రాల గ్యాంగ్ వార్ తో రోడ్లపై వెళ్లే ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
రాళ్ల దాడిలో పలు వాహనాలు దెబ్బతినగా..పలువురు హిజ్రాలు సైతం గాయపడ్డారు. రోడ్లపై గ్యాంగ్ వార్ కు దిగిన హిజ్రాలను అదుపు చేసేందుకు టూ టౌన్, రూరల్ పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వంద మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. హిజ్రాల గ్యాంగ్ వార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.