Telangana | తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఇవాళ‌, రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు

Telangana | తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు ఇవాళ‌, రేపు సెలవులు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు గురు, శుక్ర‌వారాల్లో సెల‌వులు ప్ర‌క‌టించామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. రాబోయే నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు..! రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి […]

Telangana | తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఇవాళ‌, రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు

Telangana | తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు ఇవాళ‌, రేపు సెలవులు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు గురు, శుక్ర‌వారాల్లో సెల‌వులు ప్ర‌క‌టించామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

రాబోయే నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు..!

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఐదు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్, 7 జిల్లాల‌కు ఆరెంజ్, మిగ‌తా జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

సియర్‌ సూన్‌ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.