Honey Bees | ఓ పురుగును చూసి భయపడుతున్న అమెరికా శాస్త్రవేత్తలు
Honey Bees | విధాత: ఇన్నేళ్లుగా అమెరికా (America) లో ఉనికిలో లేని ఒక జాతికి చెందిన పురుగు ఇటీవల శాస్త్రవేత్తల కంట పడింది. దాంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవతున్నారు. అంతే కాకుండా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ నోటీసులు కూడా పంపించేశారు. శాస్త్రవేత్తలను అంతగా కలవరపెడుతున్న ఆ కీటకం పేరు ఎల్లో లెగ్‌డ్ హార్నెట్. దీని ప్రధాన ఆహారం తేనెటీగలు. ఇవి తేనెటీగలను విచ్చలవిడిగా వేటాడి హాంఫట్ చేసేస్తాయి. మానవాళి ఆహార గొలుసులో తేనెటీగల (Honey […]
Honey Bees | విధాత: ఇన్నేళ్లుగా అమెరికా (America) లో ఉనికిలో లేని ఒక జాతికి చెందిన పురుగు ఇటీవల శాస్త్రవేత్తల కంట పడింది. దాంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవతున్నారు. అంతే కాకుండా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ నోటీసులు కూడా పంపించేశారు. శాస్త్రవేత్తలను అంతగా కలవరపెడుతున్న ఆ కీటకం పేరు ఎల్లో లెగ్‌డ్ హార్నెట్. దీని ప్రధాన ఆహారం తేనెటీగలు. ఇవి తేనెటీగలను విచ్చలవిడిగా వేటాడి హాంఫట్ చేసేస్తాయి. మానవాళి ఆహార గొలుసులో తేనెటీగల (Honey Bees) ప్రాధాన్యం మనకు తెలిసిందే. ఒకవేళ తేనెటీగలు అంతరించిపోతే.. కేవలం వారం రోజుల్లో ప్రపంచం మొత్తం కరవు సంభవిస్తుంది. తేనెటీగల సంఖ్య పడిపోతే.. వ్యవసాయం, పళ్ల తోటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే అమెరికా శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు.
ఇన్నేళ్ల కాలంలో అమెరికాలో బహిరంగంగా ఈ కీటకం కనపడటం ఇదే తొలిసారని జార్జియా అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ కీటకం సాంకేతిక నామం వెస్పా వెలుటినా.. దీని పుట్టినిల్లు దక్షిణాసియా. తేనె పట్టుల మీద దాడి చేసి తేనెటీగలను చంపేస్తుంది కాబట్టి దీనినే మర్డర్ హార్నెట్ (Murder Hornet) అని కూడా పిలుస్తారు. తేనెటీగల సంఖ్య తక్కువ కావడం.. వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. వెంటనే వీటిని గుర్తించి ఎక్కడికక్కడ చంపేయాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఒక్క అమెరికాలోనే మొత్తం జనాభా తీసుకునే ఆహారంలో ఒకటో వంతు పదార్థాలు తేనెటీగల వల్ల వస్తాయి. ఆపిల్స్, పుచ్చకాయలు, క్రాన్ బెర్రీస్, గుమ్మడికాయలు, స్క్వాష్, బ్రకోలీ, ఆల్మండ్స్ మొదలైన వాటి ఉత్పత్తి చక్రంలో వీటి పాత్ర చాలా కీలకం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram