Hyderabad | శృంగారానికి నో చెప్పింద‌ని భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Hyderabad | ఓ వ్య‌క్తి త‌న భార్య ప‌ట్ల క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. భార్య శృంగారానికి నో చెప్పింద‌ని, ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో మే 20వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ సైదాబాద్ ఏరియాకు చెందిన ఓ మ‌హిళ నెల రోజుల క్రితం రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే త‌న‌తో శృంగారం చేయాల‌ని ఆమెను భ‌ర్త కోరాడు. తాను బాలింత‌న‌ని, శ‌రీరం […]

Hyderabad | శృంగారానికి నో చెప్పింద‌ని భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Hyderabad | ఓ వ్య‌క్తి త‌న భార్య ప‌ట్ల క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. భార్య శృంగారానికి నో చెప్పింద‌ని, ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో మే 20వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ సైదాబాద్ ఏరియాకు చెందిన ఓ మ‌హిళ నెల రోజుల క్రితం రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే త‌న‌తో శృంగారం చేయాల‌ని ఆమెను భ‌ర్త కోరాడు. తాను బాలింత‌న‌ని, శ‌రీరం ఇంకా కోలుకోలేద‌ని భ‌ర్త‌కు భార్య న‌చ్చ‌జెప్పింది. అవేమీ ప‌ట్టించుకోకుండా, ఆమెతో వాగ్వాదానికి దిగాడు భ‌ర్త‌.

శృంగారం విష‌యంలో మే 20వ తేదీన భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆమె గొంతు నులిమి పారిపోయాడు. అప‌స్మార‌కస్థితిలోకి వెళ్లిన భార్య‌ను కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలి గొంతుపై మ‌ర‌క‌లు ఉన్నాయ‌ని, ఆమెది హ‌త్యే అని పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది. దీంతో భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని, విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. అనంత‌రం అత‌నికి రిమాండ్ విధించారు.