హస్త ప్రయోగం తప్పు కాదు.. కానీ అతిగా చేస్తే ఆ సమస్యలు తప్పవట..!
పెళ్లైన దంపతులు శారీరక సుఖం కోసం శృంగారంలో పాల్గొంటారు. ఈ శృంగార చర్యకు వీలు కానప్పుడు చాలా మంది మగాళ్లు తమ కోరికలను తీర్చుకునేందుకు హస్త ప్రయోగాన్ని ఎంచుకుంటారు. ఈ ప్రక్రియ ద్వారా తృప్తి పొందుతారు. అయితే ఈ హస్త ప్రయోగం కొన్ని సందర్భాల్లో మంచిదే అయినా.. అతిగా చేయడం వల్ల అనర్థాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెళ్లైన దంపతులు శారీరక సుఖం కోసం శృంగారంలో పాల్గొంటారు. ఈ శృంగార చర్యకు వీలు కానప్పుడు చాలా మంది మగాళ్లు తమ కోరికలను తీర్చుకునేందుకు హస్త ప్రయోగాన్ని ఎంచుకుంటారు. ఈ ప్రక్రియ ద్వారా తృప్తి పొందుతారు. అయితే ఈ హస్త ప్రయోగం కొన్ని సందర్భాల్లో మంచిదే అయినా.. అతిగా చేయడం వల్ల అనర్థాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణాల్లో జరిగిపోయే హస్త ప్రయోగంతో దీర్ఘకాలంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, అవి మానసిక జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు హస్త ప్రయోగం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి..? అపోహలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హస్త ప్రయోగంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?
శృంగార చర్యలో పాల్గొంటే శరీరమంతా ఒకింత అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే శరీరంలోని ప్రతి భాగంలో కదలిక ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చురుకుగా ఉంటుంది. శృంగార సమయంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలై ఒత్తిడి తగ్గి రిలాక్స్‌గా ఉంటుంది. హస్తప్రయోగంతో కాస్త రిలీఫ్ వచ్చినా.. శరీరం యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కండరాలు వదులైపోయే అవకాశం ఉంది. ఇది భవిష్యత్‌లో లైంగిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కండరాలు కదలకపోవడం వల్ల, వదులుగా మారడం వల్ల శరీరంలో ఫ్యాట్ కూడా ఎక్కువ పేరుకుపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
హస్త ప్రయోగం తర్వాత అలా చేస్తే మొటిమలు వస్తాయా..?
యుక్త వయసు వచ్చిన వారికి లేదా భార్యకు దూరంగా ఉన్న సమయంలో శృంగార కోరికలు రావడం సహజం. అలాంటి సమయంలో హస్త ప్రయోగానికి పాల్పడుతుంటారు. అయితే హస్త ప్రయోగం చేయడం వల్ల మొటిమలు వస్తాయని చాలా మంది అంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం చేయడం తప్పు కాదని, అదొక ఆర్గాజం మాత్రమే. అయితే హస్త ప్రయోగం చేసిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి. అలా చేయకుండా ఆ చేతిని ముఖంపై పెడితే.. కచ్చితంగా మొటిమలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
హస్త ప్రయోగం ఎక్కువసార్లు చేస్తే జుట్టు రాలిపోతుందా..?
హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయట. ఈ హస్త ప్రయోగం అనేది రోజుకి ఒకసారి చేసుకుంటే మంచిదని.. ఎక్కువసార్లు చేస్తే అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా హస్తప్రయోగం చేయడం టెస్టోస్టిరాన్ అనే హర్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని.. ఇది జుట్టు కుదుళ్లపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీనివల్ల జుట్టు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం అధికంగా ఉంది. థైరాయిడ్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.