TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం కూడా లీక్.. రద్దు యోచనలో టీఎస్‌పీఎస్సీ
TSPSC | టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్( TPBO ) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్( Assistant Engineer ) ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రశ్నాపత్రం పరీక్షకు రెండు రోజుల ముందు లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ పరీక్షను కూడా రద్దు […]

TSPSC | టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్( TPBO ) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్( Assistant Engineer ) ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రశ్నాపత్రం పరీక్షకు రెండు రోజుల ముందు లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ( TSPSC ) ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయిని రేణుక, ఆమె భర్త, సోదరుడు ఉన్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన మరో ముగ్గురు కూడా అరెస్టు అయినవారిలో ఉన్నట్లు సమాచారం.
పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు..
అయితే అసిస్టెంట్ ఇంజినీర్, టీపీబీవో పోస్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ తన పెన్‌డ్రైవ్‌లో వేసుకుని బయటకు తీసుకెళ్లినట్లు తేలింది. ఉపాధ్యాయిని రేణుక ద్వారా ప్రశ్నాపత్రాలను బయటి వ్యక్తులకు ఇద్దరికి అమ్మేశారు. అందుకు వారి నుంచి రూ. 13.5 లక్షలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు.
పేపర్ల లీక్‌కు కలిసొచ్చిన కంప్యూటర్ల అప్‌గ్రేడ్
అయితే ఇటీవలే కమిషన్‌లో ఉన్న కంప్యూటర్లను అధికారులు అప్‌గ్రేడ్ చేయించారు. ఆ సమయంలో కీలకమైన కంప్యూటర్ల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సెక్రటరీ పీఏ ప్రవీణ్ తస్కరించారు. ఇందుకు సిస్టమ్ అనలిస్టు రాజశేఖర్ సాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఒకరిద్దరు అధికారుల కంప్యూటర్లలోనే ప్రశ్నాపత్రాలన్నీ డిజిటల్ ఫార్మాట్‌లలో ఉంటాయి. తాజాగా అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ కూడా లీకైందని పోలీసులు తేల్చడంతో.. టీఎస్‌పీఎస్సీ పరీక్షల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.