Hyper Aadi | `నడవలేని రష్మి.. పొడవలేని సుధీర్‌`: ఆది

Hyper Aadi | బుల్లితెర‌పై క్రేజీ జంట‌ల‌లో సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్ టాప్‌లో ఉంటారు. వారిద్ద‌రు క‌లిసి చేసిన ప్ర‌తి షో స‌క్సెస్ కావ‌డంతో ఈ జంటి చాలా క్రేజ్ ఏర్ప‌డింది. గ‌త ఏడాది నుండి వీరిద్ద‌రు విడివిడిగా షోస్ చేస్తుండ‌గా, చాలా రోజుల త‌ర్వాత ఈటీవీ 28ఏళ్ల సెలబ్రేషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంకి క‌లిసి ప‌ని చేశారు. `ఈటీవీ బలగం` పేరుతో ఈ స్పెష‌ల్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా, దీనికి ర‌ష్మీ, సుధీర్ ఇద్ద‌రు క‌లిసి […]

  • By: sn    latest    Aug 20, 2023 6:31 AM IST
Hyper Aadi | `నడవలేని రష్మి.. పొడవలేని సుధీర్‌`: ఆది

Hyper Aadi |

బుల్లితెర‌పై క్రేజీ జంట‌ల‌లో సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్ టాప్‌లో ఉంటారు. వారిద్ద‌రు క‌లిసి చేసిన ప్ర‌తి షో స‌క్సెస్ కావ‌డంతో ఈ జంటి చాలా క్రేజ్ ఏర్ప‌డింది. గ‌త ఏడాది నుండి వీరిద్ద‌రు విడివిడిగా షోస్ చేస్తుండ‌గా, చాలా రోజుల త‌ర్వాత ఈటీవీ 28ఏళ్ల సెలబ్రేషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంకి క‌లిసి ప‌ని చేశారు.

‘ఈటీవీ బలగం’ పేరుతో ఈ స్పెష‌ల్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా, దీనికి ర‌ష్మీ, సుధీర్ ఇద్ద‌రు క‌లిసి హోస్ట్ చేశారు. ఈ షోకి సంబంధించి వ‌రుస ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన ప్రోమోలో ర‌ష్మీ కోపంగా ఉండటాన్ని చూసిన సుధీర్‌.. ఏంటి మేడమ్‌ గారు సీరియస్‌గా ఉన్నారని అడ‌గ్గా, దానికి స్పందించిన ర‌ష్మి.. నేనసలు గుర్తున్నానా అంటూ కోపంగా ప్ర‌శ్నించింది.

అయితే ర‌ష్మీ ప్ర‌శ్నకు సుధీర్ గుండెలు పిండే స‌మాధానం ఇచ్చాడు. నువ్వు గుర్తున్నావ్‌ కాబట్టే ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నా అని చెప్ప‌డంతో ఆమె ఫిదా అయిపోయి మెలిక‌లు తిరిగింది. ఇక ఇదే స‌మ‌యంలో గెట‌ప్ శీను.. ఈ ప్రేమ పక్షుల్లో గాల్లోనే ఎగురుతాయా? గూటికి ఏమైనా చేరుతాయా? అని అడ‌గ‌డంతో వారిద్ద‌రు తెగ మెలిక‌లు తిరుగుతూ సిగ్గు ప‌డ్డారు.

ఏంటి ప‌రిస్థితి అని శ్రీను.. సుధీర్‌ని అడ‌గ‌గా, ఆయ‌న చెప్పిన స‌మాధానానికి ర‌ష్మీ చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఇక వీరిద్ద‌రి లవ్ మేట‌ర్ తేల్చేందుకు హైప‌ర్ ఆది కూడా రంగంలోకి దిగాడు. చాలా రోజుల తర్వాత ఇలా క‌లిసారు, ఆ పెళ్లి ఏదో త్వ‌ర‌గా చేసుకోవచ్చుగా అని అడిగాడు ఆది. మీరు ఇంకా ఇలానే రెండేళ్లు ఆగితే మాత్రం ఇద్దరిపై సినిమా తీస్తానని చెప్పుకొచ్చాడు.

అప్పుడు ర‌ష్మీ మా సినిమాకి ఏం పేరు పెడ‌తావ‌ని అడ‌గ్గా,దానికి స్పందించిన ఆది.. నడవలేని రష్మి పొడవలేని సుధీర్‌’ అని టైటిల్‌ పెడతా అని అన్నాడు. దాంతో అక్క‌డి వారంద‌రు ప‌గ‌ల‌బ‌డిన‌వ్వారు. మొత్తానికి చాలా గ్యాప్ త‌ర్వాత సుధీర్, ర‌ష్మీలు ఇలా బుల్లితెర‌పై క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంటే ప్రేక్ష‌కుల‌కి ఏదో తెలియ‌ని ఎనర్జీ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది.

ఇక షోలో సుధీర్ ఎప్పటిలాగే పులిహోర కలుపుతూ ఉండ‌గా , ర‌ష్మీ త‌న రొమాంటిక్ లుక్స్ తో అల‌రించింది. ప్ర‌స్తుతం వీరికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా, సుడిగాలి సుధీర్‌ హీరోగా ‘గాలోడు’ అనే చిత్రం రాగా, ఈ సినిమా పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. ఇప్పుడు ‘కాలింగ్‌ సహస్ర’ అనే చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్న‌ట్టు టాక్.