Hyper Aadi | ప‌విత్ర ముందే.. న‌రేష్‌పెళ్లిళ్ల‌పై పంచ్‌లు వేసిన హైప‌ర్ ఆది

Hyper Aadi | విజ‌య నిర్మ‌ల త‌నయుడు న‌రేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మంచి హీరోగా అల‌రించిన న‌రేష్ ఆ త‌ర్వాత స‌పోర్టింగ్ రోల్‌లోను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల న‌రేష్ వివాదాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు. . అయితే న‌రేష్ కొన్నాళ్ల పాటు రాజ‌కీయాల్లోకి వెళ్లి రాణించే ప్ర‌య‌త్నం చేసిన అది క‌లిసి రాక‌పోవ‌టంతో ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నాడు. వి.కె.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా, కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు. అయితే న‌రేష్ […]

  • By: sn    latest    Aug 31, 2023 1:55 AM IST
Hyper Aadi | ప‌విత్ర ముందే.. న‌రేష్‌పెళ్లిళ్ల‌పై పంచ్‌లు వేసిన హైప‌ర్ ఆది

Hyper Aadi |

విజ‌య నిర్మ‌ల త‌నయుడు న‌రేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మంచి హీరోగా అల‌రించిన న‌రేష్ ఆ త‌ర్వాత స‌పోర్టింగ్ రోల్‌లోను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల న‌రేష్ వివాదాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు. . అయితే న‌రేష్ కొన్నాళ్ల పాటు రాజ‌కీయాల్లోకి వెళ్లి రాణించే ప్ర‌య‌త్నం చేసిన అది క‌లిసి రాక‌పోవ‌టంతో ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నాడు.

వి.కె.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా, కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు. అయితే న‌రేష్ ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త జీవితంలో వ‌చ్చిన స‌మ‌స్య‌లతో ఆయ‌న హాట్ టాపిక్ అయ్యాడు. ప‌విత్ర లోకేష్‌తో కొన్నాళ్ళుగా స‌హ‌జీవ‌నం చేయ‌డం,ఆమెని వివాహం చేసుకుంటాన‌ని న‌రేష్ చెప్ప‌డం ఆయ‌న పేరు వార్త‌ల‌లోకి ఎక్కేలా చేసింది.

‘సామీ రారా’ అనే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ఈటీవీలో ప్రసారం కానుండ‌గా,ఈ ఈవెంట్‌కి న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు. హైపర్ ఆది, తదితర కమెడియన్స్ షోలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో హైపర్ ఆది.. పవిత్రా పక్కనే ఉన్నప్పటికీ ‘నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్’ అని న‌రేష్‌ని ప్ర‌శ్నించాడు. దానికి న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ న‌వ్వుతూ క‌నిపించారు. దానికి ఏం స‌మాధానం ఇచ్చార‌నేది ఎపిసోడ్ టెలికాస్ట్ రోజు మాత్ర‌మే తెలియనుంది.

ఆరు ప‌దులు వ‌య‌సు దాటిన సీనియర్ నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్ అయ్యారు.. ఆయ‌న పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో నిత్యం ఏవో ఒక వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఆయన పోకడపై పెద్ద గొడవే చేసి ర‌చ్చ చేసింది.

న‌రేష్ ముందుగా సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీను కుమార్తెను ముందుగా వివాహం చేసుకోగా, వారికి న‌వీన్ విజ‌య్ కృష్ణ అనే కొడుకు ఉండ‌గా, అత‌ను హీరోగా రెండు, మూడు సినిమాల్లో న‌టించి సక్సెస్ లేక సినిమాల‌కి దూరంగా ఉన్నాడు. ర‌చ‌యిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖా సుప్రియ‌ను వివాహం చేసుకోగా, వారి వైవాహిక దాంప‌త్యంలో కూడా ఓ కొడుకు పుట్టారు.

తామెతోను వచ్చిన‌ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడిపోయారు. త‌ర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి సోద‌రుడి కుమార్తె అయిన ర‌మ్య ర‌ఘ‌ప‌తిని పెళ్లి చేసుకోగా, వీరికి ఓ కొడుకు ఉన్నారు. అయితే ర‌మ్య ర‌ఘుప‌తి విడాకులు ఇవ్వ‌న‌ని చెప్ప‌టం.. మీడియాకెక్క‌టంతో న‌రేష్ పేరు మారుమ్రోగిపోతుంది.