అది సహించలేకపోయా.. అందుకే ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలనుకున్నా..

Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బుధవారం సాయంత్రం హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్ .. ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు కంటెయినర్‌లో వెళ్తుండగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. పాక్‌ పంజాబ్‌లోని వజీరాబాద్‌ అల్లావాలాచౌక్‌లో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగింది. […]

అది సహించలేకపోయా.. అందుకే ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలనుకున్నా..

Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బుధవారం సాయంత్రం హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్ .. ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు కంటెయినర్‌లో వెళ్తుండగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. పాక్‌ పంజాబ్‌లోని వజీరాబాద్‌ అల్లావాలాచౌక్‌లో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇమ్రాన్‌ కాలికి తూటా తగిలింది. ఒకరు మృతిచెందగా,మరో ఆరుగురికి కూడా తూటాలు తగిలాయి.

అయితే కాల్పులు జరిపిన యువకుడిని ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా నిందితుడు మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రజలను ఇమ్రాన్ ఖాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. అది సహించలేకపోయాను. అందుకే ఇమ్రాన్ ఖాన్ ను చంపాలనుకున్నాను. తన వెనుకాల ఎవరూ లేరని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే కాల్పులు జరిపానని తెలిపాడు. వజీరాబాద్ వరకు బైక్ పై వచ్చానని, అక్కడ తన అంకుల్ షాపు వద్ద ఆ వెహికిల్ ను ఉంచినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.